Breaking News

ముస్లిం సోదర సోదరీ మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ , కలెక్టర్ మాధవీలత తదితరులు

-మత ప్రార్థనలు నిర్వహించిన మంత్రి, తదితరులు
-జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు సందర్భంగా హోం మంత్రి సందేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అక్కడ నుంచి తన సందేశం పంపి.. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియ చేశారు.

కటినమైన ఉపవాస దీక్షలు వలన మంచి ఫలితాల ను పొందుతారని, ఎదుటివారి ఆకలి విలువ తెలుసుకోగలిగెలా అందరూ సమానం అన్న  సమానత్వం  వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

బుధవారం రాత్రి  జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రవేటు ఫంక్షన్ హల్ లో (మంజీరా) ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, రంజాన్ నెలలో సంపాదనా పరులైన వారు వారి శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యాలని బోధిచడం ద్వారా మానవీయ విలువలు ప్రాధాన్యత ను చాటి చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. ముస్లిం మతం  సంపన్నులైనవారు రంజాన్ నెలలో ‘ జకాత్ ‘ అచరించాలని ఖురాన్ బోధిస్తోందన్నారు.  ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ‘ జకాత్’ అని ఇది  పేదల ఆర్థిక హక్కుగా ఖురాన్ లో  పేర్కొంటారు. నాడు స్వర్గీయ వై ఎస్ ఆర్ , నేడు మన ప్రియతమ వై యస్ జగన్ మోహన్ రెడ్డి లు ముస్లిం లకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఆ వర్గాలను గౌరవిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగందన్నారు. నాడు నేడు కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యకు అత్యంత ప్రాధన్యతను ఇస్తూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వము కృషి చేస్తోందన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వన్ని పెంపొందిస్తాయన్నరు.

మైనారిటి సబ్ ప్లాన్ తీసుకుని రావడం ద్వారా ఒక చరిత్ర కు శ్రీకారం చుట్టి, ముస్లిం మైనార్టీలకు అండగా ఈ ప్రభుత్వం నిలిచిందన్నారు. ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి తెలిపారు.

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం ‘ అని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.  క్రమ శిక్షణకి మారుపేరు రంజాన్ మాసం దీక్షల ని పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సమాజాభివృద్ధి సమాంతరంగా జరగాలంటే ప్రతిఒక్కరు చదువుకోవాలన్నారు.

ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారని తెలిపారు.

కులమతాలకు అతీతంగా.. రాజమహేంద్రవరం నగరం మత సామరస్యానికి ప్రతీక అని రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్,  అన్నారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరం ఒక్కటని, అందరం సోదర భావంతో మెలగాలనే ఆలోచనతోనే   ఈ ఇస్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.

రూడా చైర్ పర్సన్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి చేయూతనందించారన్నారు. అదే క్రమంలో నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి మైనార్టీ వర్గాల వారి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ తో ఉన్నత విద్యను చదువుకునే అవకాశం కల్పించారన్నారు.

మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్ మాట్లాడుతూ ధనికుడు, పేదవాడనే తారతమ్యం లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రమైన ఈ రంజాన్ పండుగ వేడుకలను ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టతో చేస్తున్న ముస్లిం సోదరులందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, డిసిసిబి చైర్మన్ ఆకులు వీర్రాజు,గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా,ముస్లిం ఐక్యవేదిక కన్వీనర్ అభిబుల్లా ఖాన్, వక్స్ బోర్డ్ మాజీ చైర్మన్ కరీం ఖాన్, కో కన్వీనర్ అన్సార్ అహ్మద్, వక్ఫ్ బోర్డ్ జిల్లా చైర్మన్ ఆరీఫ్, ప్రభుత్వ ఖాజీ మౌలానా షేక్ కరీముల్లా, మౌలానా అఫీజిలా ఖాన్,పలువురు  వ్యక్తలు మాట్లాడుతూ, మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు.అలాగే ముస్లిం సోదరులందరూ
ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లా మన్ననలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *