Breaking News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమాచార శాఖా మంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న గౌ. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి ఆలయ డిప్యూటీ ఈ ఓ లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ స్వాగతం పలికారు. మంత్రి ముందుగా తులాభారం మొక్కులు తీర్చుకుని, ధ్వజస్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా డిప్యూటీ ఈ ఓ తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. అమ్మవారి దర్శనానికి ముందు మంత్రి గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య మరియు జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇంఛార్జి అధికారి భాస్కర్ రెడ్డి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *