Breaking News

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు వివిధ ప్రభుత్వ శాఖలతో వెనుకబడిన తరగతుల ప్రజల సాధికారత కోసం అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాల గురించి, నల్సా వారి “అక్రమ రవాణా బాధితులు మరియు వాణిజ్య పరమైన లైంగిక దోపిడి బాధితుల పథకం, 2015” మరియు “మాదక ద్రవ్యాల బాధితులకు న్యాయ సేవల పథకం, 2015” పథకాల పై న్యాయ విజ్ఞాన సదస్సు స్థానిక డి ఎల్ ఎస్ ఏ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ వెనుబడిన ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉన్నా అందరికీ వీటిపై పూర్తి అవగాహన లేదని అన్నారు.  క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వర్డ్/గ్రామ వాలంటీర్లు అర్హులైన ప్రజలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేలా చూడాలని తెలియజేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం ఎక్కువగా ఉందని, ఈ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన కారాగార శిక్షతో పాటు పెద్దమొత్తంలో జరిమానాలు ఉన్నాయన్నారు. మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలకు గురవుతారని అన్నారు. అక్రమ రవాణా, లైంగిక దోపిడి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ తరహా బాధితులకు నల్సా న్యాయ సేవల పథకం గురించి వివరించారు.  రాజమహేంద్రవరం దిశా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి ఎం. తిరుమల రావు మరియు కాకినాడ జిల్లా డి.ఎస్.పి. బి.అప్పారావు మాట్లాడుతూ సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు పిల్లలు గురవ్వకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి.ఎస్.ఎం. వల్లి అసంఘటిత కార్మికులకు అందుబాటులో ఉన్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలిపారు.

ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్.సి. సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి, రాజమహేంద్రవరం డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డా. సుధాకర్,   రాజమహేంద్రవరం సహ సాంఘిక సంక్షేమ అధికారి పి.వి.డి. ప్రసాద్, రెవెన్యూ, పోలీస్, మునిసిపాలిటీ, గ్రామం పంచాయితీ, డి.ఆర్.డి.ఏ, మెప్మా, తదితర శాఖల అధికారులు, వివిధ ఎన్. జీ.వో. ల వారు, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *