Breaking News

రబీ ధాన్యం సేకరణకు మండల ప్రత్యేక అధికారుల నియామకం.. జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత 2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియను సజావుగా నిర్వర్తించడం, పర్యవేక్షణ బాధ్యతలను ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీ 2022-23కి ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులు/డిప్యూటీ కలెక్టర్‌లకు విధులను అప్పగించడం జరిగిందన్నారు. అర్భికేల వారీగా కేటాయించిన లక్ష్యాలతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కు రైతులు బహిరంగ మార్కెట్ లో నిర్వహించే లావాదేవీలను కూడా పరిశీలన చెయ్యడం జరుగుతుందని తెలిపారు.

రెవెన్యూ డివిజన్: రాజమహేంద్రవరం పరిధిలో ఉన్న 9 మండలాల కుగాను అనపర్తి మండలానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, రాజమహేంద్రవరం, బిక్కవోలు కు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్, గోకవరం డివిజనల్ స్థాయి అభివృద్ధి అధికారి (డిఎల్ డివో), కడియం కు జిల్లా ఉద్యానవన అధికారి, కోరుకొండ కు కోరుకొండ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, రంగంపేటకు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, రాజానగరం కు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, రాజమహేంద్రవరం రూరల్ డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్, సీతానగరం జిల్లా సహకార అధికారి వారిని నియమించడం జరిగిందన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని 9 మండలాలకు ప్రత్యేక అధికారులు

చాగల్లు మండలానికి జిల్లా బీసీ సంక్షేమ అధికారి, దేవరపల్లి జిల్లా పౌర సరఫరాల అధికారి, గోపాలపురం కు కొవ్వూరు డివిజనల్ స్థాయి అభివృద్ధి అధికారి (డి ఎల్ డివో) , కొవ్వూరు కు రెవెన్యూ డివిజనల్ అధికారి, నల్లజర్ల కు జిల్లా వ్యవసాయ అధికారి, నిడదవోలు కు ఏ పి ఎమ్ ఐ పి ప్రాజెక్ట్ డైరెక్టర్, పెరవలి కి జిల్లా శిశు అభివృద్ధి అధికారి, తాళ్లపూడి కి కొవ్వూరు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ఉండ్రాజవరం కు జిల్లా ఎస్సీ సంక్షేమం & సాధికారత అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *