Breaking News

నిజాయితీ గల జీవన శైలిని అలవర్చుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి గురువారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం మరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించి ఆ కారాగారాల్లో వసతులను పరిశీలించారు. అనంతరం న్యాయమూర్తి ఖైదీలతో మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవల గురించి వివరించారు. కారాగారంలో కానీ, కేసు విషయంలో కానీ, వారి కుటుంబ సభ్యుల న్యాయ సంబంధిత సమస్యలు కానీ ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని కోరారు. అందరూ పరివర్తన చెంది నిజాయితీ గల జీవన శైలిని అలవర్చుకోవాలని న్యాయమూర్తి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *