Breaking News

జగన్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి

-గవర్నర్, రాష్ట్రపతి లకు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు ర్యాలీపై రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో రాళ్లదాడి జరగడం సిగ్గుచేటని, జగన్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్, రాష్ట్రపతిలకు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సాదర బోయిన ఏడుకొండలు విజ్ఞప్తి చేశారు. శనివారం బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏడుకొండలు మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో రాళ్ల దాడి చేయడం దారుణమని విమర్శించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, అలాగే సురేష్ ను మంత్రివర్గం నుండి డిస్మిస్ చేయాలని గవర్నర్, రాష్ట్రపతిని ఏడుకొండలు డిమాండ్ చేశారు. పోలీసులు కూడా జగన్ కు వంతపాడుతూ చంద్రబాబు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని విమర్శించారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్న వైసిపి నాయకులను జైలుకు పంపించడం ఖాయమని హెచ్చరించారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు గణపా రాము, జగదీష్, రాజగిరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *