Breaking News

గరుడ కంటి & దంత. హాస్పిటల్ ప్రారంభం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్ లో గరుడ కంటి & దంత హాస్పటల్ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చేతుల మీదుగా ఆదివారం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్ లో గరుడ కంటి & దంత వైద్యశాల ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమి రెడ్డి మాట్లాడుతూ మిడిల్ క్లాస్ ,లోయర్ మిడిల్ క్లాస్, అజిత్ సింగ్ నగర్ వాసులకు ఈ హాస్పిటల్ చాలా ఉపయోగపడుతుందని, నిర్వాహకులు శ్రీ హర్ష, ఇబ్రహీం లను అభినందిస్తున్నానని అన్నారు. సేవా కార్యక్రమముల ద్వారా సేవ చేయాలని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలని ఆయన అన్నారు .నిర్వాహకులు శ్రీ హర్ష, ఇబ్రహీం మాట్లాడుతూ తిరువూరు, నందిగామ మా బ్రాంచీలు ఉన్నాయని, విజయవాడలో ఈ బ్రాంచ్ మూడో బ్రాంచ్ అని 10 సంవత్సరాలు వైద్య రంగంలో మాకు అనుభవం ఉందని, ఓ పి నెల రోజులు వరకు ఫ్రీగా చేస్తామని, అత్యాధునిక పద్ధతిలో కంటి మరియు దంత పరీక్షలు నిర్వహించి కుట్లు లేకుండా నూతన పద్ధతుల ద్వారా ఆపరేషన్ చేస్తామని ఆయన అన్నారు. ఈ హాస్పిటల్ లో ఇద్దరు డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారని కంటికి సంబంధించి కంటిలో పొర, నీటి కాసులు ఇతర వ్యాధులు నూతన పద్ధతుల ద్వారాట్రీట్మెంట్ చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ రుహలా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *