Breaking News

నెలలో ప్రతి శనివారం డిప్లొమా ఇన్ జర్నలిజం అభ్యర్థులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఆన్ లైన్ అవగాహన తరగతులు

-సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిప్లొమా ఇన్ జర్నలిజం అభ్యర్థులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఆన్ లైన్ అవగాహన తరగతులను నిపుణులచే నిర్వహించ నున్నట్లు సి. ఆర్. ఎపి మీడియా అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి శనివారం ఎంపిక చేసిన అంశం పై ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ఈ అవగాహన తరగతులకు రాష్ట్రం లోని వర్కింగ్ జర్నలిస్టులందరూ ఆన్ లైన్ విధానం లో హాజరుకావచ్చని ఆయన తెలిపారు. డిప్లొమా ఇన్ జర్నలిజం క్లాసులు మే నెల 1 వ తేదీ నుంచి మొదలుకానున్న దృష్ట్యా మే నెల మొదటి శనివారం 6 వ తేదీన “సాహిత్యం – సమాజం” అనే అంశం పై ప్రసిద్ధ సాహితీ వేత్త ‘ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్’ ప్రసంగం వుంటుందని చైర్మన్ తెలిపారు.

డిప్లొమా ఇన్ జర్నలిజం అభ్యర్థులకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి క్లాసు, 9 గంటల నుంచి 10 గంటల వరకు రెండో క్లాసు నిర్వహించడం జరుగుతుందన్నారు. “మే” 1 వ తేదీన ప్రముఖుల సందేశాలతోబాటు, శుభాకాంక్షలుంటాయన్నారు. మే నెల 2 వ తేదీ నుంచి క్లాసులు నిర్వహణ ఉంటుందన్నారు. ‘మే’ నెల 2 వ తేదీన జర్నలిజం – నిర్వచనం, పరిధి, రేడియో మాధ్యమం – లక్షణాలు అనే అంశాల పైన, 3 వ తేదీ జర్నలిజం- సమాజంలో దాని స్థానం, రేడియో – మాధ్యమం, స్వభావం, పరిధి, అనే అంశాల పైన, 4 వ తేదీ స్వాతంత్రోద్యమంలో పత్రికల రచనాశైలి, రేడియో వివిధ కార్యక్రమాల రూప కల్పన అనే అంశాల పైన, 5 వ తేదీ స్వాతంత్రోద్యమంలో పత్రికల పాత్ర, స్ఫూర్తి, రేడియో కార్యక్రమాల రూప కల్పన – జాగ్రత్తలు అనే అంశాల పైన డా. ఎన్. ఈశ్వర రెడ్డి, డా. నాగనూరి వేణు గోపాల్ లు తరగతులు నిర్వహిస్తారని సి.ఆర్. మీడియా అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సి. ఆర్. ఎపి మీడియా అకాడెమి ఆధ్వర్యం లో ప్రారంభించనున్న జర్నలిజం లో డిప్లొమా కోర్సు కు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెర్నర్స్ సపోర్ట్ సర్వీసెస్ బ్రాంచ్ డైరెక్టర్ శ్రీ ఎల్.వి.కె రెడ్డి కోర్సు కోర్డినేటర్ గా వ్యవహరిస్తుండగా, నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగపు హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు శ్రీమతి డా. జి. అనిత, ఆంధ్రా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగపు రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు బాబీ వర్ధన్ లు సహకారం అందిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *