Breaking News

ప్రజల భాగస్వామ్యంతో మలేరియాను కట్టడి చేద్దాం…

-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మలేరియా వ్యాప్తికి గల కారణాలపై అవగాహనా కలిగి నివారణ చర్యల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు.
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మలేరియా శాఖ ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన అవగాహనా ర్యాలీని మంగళవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ మలేరియా వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం అన్నారు. మలేరియా వ్యాధి నివారణ చర్యలు ప్రతి ఇంటి ప్రారంభం కావాలన్నారు. మలేరియా వ్యాధి ప్రబలకుండా దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు. ఇంటి పరిసరాల్లోని మురికి కాలువలో చెత్తాచెదారం నిల్వ ఉండకుండా పరిశుబ్రాంగా ఉంచాలన్నారు. మురికి నీరు ఎప్పుడూ పారేటట్లు చూడాలని, ఇంటి పరిసరాలలో ఖాళీ టైర్లు, సీసాలు, కొబ్బరి బొండాలు తదితర పరికరాల్లో నీటి నిల్వ ఉండి దోమలు పెరుగుదలకు దోహదం చేస్తాయని పనికిరాని వస్తువులను తొలగించి నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకుంటే దోమల పెరుగుదలను అరికట్టవచ్చునన్నారు. మురికినీటి నిల్వలో వారానికి ఒకసారి కిరోసిన్ ఆయిల్ లేదా వాడిన ఇంజన్ ఆయిల్ ను చల్లి దోమల పుట్టుకను నివారించాలన్నారు. దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా తదితర వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఇళ్లలో దోమల రిపెల్లెంట్స్, దోమ తెరలు వాడడం, ఇంటి కిటికీలకు మెష్ ఏర్పాటు లాంటి చర్యల ద్వారా దోమ కాటు నుండి రక్షించుకోవచ్చని అన్నారు. మరుగు దొడ్ల బావికి ఏర్పాటు పైపుకు దోమల మాట్ ను ఏర్పాటు చేసుకోవాలాన్నారు. మున్సిపాల్టీలు, పంచాయితీలకు చెందిన పారిశుధ్య కార్మికులు వ్యర్ధాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా వ్యాధి ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై ప్రజలలో అవగాహనా కల్పించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మలేరియా నివారణకు ఇప్పటినుండే ప్రజలలో పూర్తి అవగాహనా కల్పించగలిగితే రానున్న వర్షకాలంలో వ్యాధిని కట్టడి చేయగలుగుతామన్నారు. ప్రజలకు అవగాహనా కల్పించడంలో పారిశుధ్య పనుల నిర్వహణలో స్థానిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేసి మలేరియా నివారణలో ప్రజలకు చైతన్యవంతులు చేయాలని కోరారు.
పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమైన మలేరియా ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా. వి. రామిరెడ్డి, డీఎంహెచ్వో డా. యం. సుహాసిని, జిల్లా మలేరియా అధికారి డా. మోతీబాబు, డిప్యూటీ డీఎంహెచ్వో డా. నళిని దేవి, ఎస్పిహెచ్వో డా. నరసింహనాయక్, డిపిహెచ్వో డా. నవీన్ పలు వైద్య అధికారులు, ఎ ఎన్ ఎం లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *