-సుమారు రూ.17,000 కోట్లు విలువ చేసే జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం
-సుమారు రూ.2,300 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఉద్దేశించి ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు రూ. 17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.2,300 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తి చేసిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో మధ్యప్రదేశ్లో 100 శాతం పూర్తి చేయబడిన విద్యుదీకరణ, వివిధ డబ్లింగ్, గేజ్ మార్పిడి మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులు ఉన్నాయి. గ్వాలియర్ స్టేషన్ పునరాభివృద్ధికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మా విద్యావాసినికి, శౌర్య భూమికి ప్రణామం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గతంలో తన పర్యటనలను, ఇక్కడి ప్రజల అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. దేశం నలుమూలల నుండి వర్చ్యువల్ విధానంలో పాల్గొన్న 30 లక్షల మందికి పైగా పంచాయితీ ప్రతినిధుల సమావేశాన్ని ఈ సందర్బంగా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇది భారత ప్రజాస్వామ్యనికి ధైర్యానికి చిహ్నానికి నిదర్శనమని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తమ తమ పనులు పరిధి భిన్నంగా ఉండవచ్చని, అయితే దేశానికి సేవ చేయడం ద్వారా పౌరులకు సేవ చేయాలనే ఉమ్మడి లక్ష్యం కోసం అందరూ పనిచేస్తారని ఆయన సూచించారు. గావ్ ఔర్ గరీబ్ – గ్రామాలు మరియు పేదల కోసం ప్రభుత్వ పథకాలను పంచాయితీలు పూర్తి అంకితభావంతో అమలు చేస్తున్నందుకు ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఈ రోజున ప్రారంభించిన పలు ప్రాజెక్టులను ప్రధానంగా ప్రస్తావిస్తూ, చింద్వార-నైన్పూర్-మండ్లా ఫోర్ట్ రైలు మార్గాన్ని విద్యుదీకరించడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇది ఈ ప్రాంత ప్రజల ఢల్లీి-చెన్నై మరియు హౌరా-ముంబైలకు కనెక్టివిటీని మరింత సులభతరం చేస్తుందని అలాగే గిరిజన ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. చింద్వార-నైన్పూర్ మధ్య ఈరోజు ప్రారంభించబడిన కొత్త రైళ్లను కూడా ఆయన ప్రస్తావించారు. అనేక పట్టణాలు మరియు గ్రామాలు నేరుగా చింద్వార, సియోనిలోని జిల్లా ప్రధాన కార్యాలయానికి అనుసంధానించబడతాయని, నాగ్పూర్ మరియు జబల్పూర్లకు వెళ్లడం కూడా చాలా సులభం అవుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలో అత్యధిక వన్యప్రాణుల సంపద గూర్చి ప్రస్తావిస్తూ రైలు కనెక్టివిటీని పెంచడం వల్ల పర్యాటకం కూడా వృద్ధి చెందుతుందని మరియు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వ శక్తి’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ ఆదివారంతో 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంటున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం పట్ల చూపుతున్న ప్రేమకు, ప్రతి ఒక్కరికి మరియు ప్రజల నుండి లభిస్తున్న మద్దతుకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్లో మధ్యప్రదేశ్ ప్రజలు సాధించిన వివిధ విజయాల గురించి ప్రస్తావించిన ప్రధాన మంత్రి, 100వ ఎపిసోడ్ కోసం అందరూ ట్యూన్ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర సహాయ మంత్రులు ఫగ్గన్ కులస్తే, సాధ్వి నిరంజన్ జ్యోతి, కపిల్ మోరేశ్వర్ పాటిల్, మధ్యప్రదేశ్ రాష్ట్ర పార్లమెంటు సభ్యులు మరియు ఆ రాష్ట్ర మంత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News