Breaking News

మే 2న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులకు ఋణాల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులకు ఋణాల పంపిణీ కార్యక్రమం మే 2వ తేదీ ఉదయం గం. 11.00లకు గాయత్రి కన్వెన్షన్ హాలు, సత్యనారాయణపురం, విజయవాడ నందు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్లాది విష్ణు, వైస్ చైర్మన్, ఎ.పి. ప్లానింగ్ బోర్డు మరియు శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ హాజరవుతారని సీనియర్ బ్రాంచి మేనేజర్ గొర్తి శ్రీనివాస్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన బ్రాహ్మణులకు ప్రాజెక్టు ఋణాల మంజూరుపై అవగాహన ఈ సమావేశంలో కల్పించబడుతుందన్నారు. పురోహితులకు “పురోహిత మిత్ర” ఋణాలు, అర్చకులకు “అర్చక మిత్ర” ఋణాలు, బ్రాహ్మణ మహిళల ఆర్ధికాభివృద్ధికి “అరుంధతి ఋణాలు”, పురుషుల స్వయం ఉపాధికి “వశిష్టా ఋణాలు”, బిజినెస్ లోన్లు, మార్టిగేజ్ లోన్లు తదితర ఋణాలపై అవగాహన ఈ సమావేశంలో కల్పించబడుతుందన్నారు. విజయవాడ బ్రాహ్మణులు ఈ సమావేశానికి హాజరుకావల్సిందిగా కోరడమైనది. తమ వద్ద గల ప్రతిపాదనలను బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచి నందు సమర్పించవలసిందిగా కోరడమైనదని,. ఇతర వివరములకు గొర్తి శ్రీనివాస్, సీనియర్ బ్రాంచి మేనేజర్ సెల్ : 9502709946, 9281029466, ల్యాండ్లైన్: 0866-2538448 నందు సంప్రదించవలసిందిగా కోరడమైనదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *