Breaking News

తిరుమల శ్రీ పద్మావతి అతిథిగృహం చేరుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు రోజుల తిరుమల,తిరుపతి పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి7.52 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి టిటిడి ఈ.ఓ ఏ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్  వెంట ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితర అధికారులు ఉన్నారు. గవర్నర్ గారు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం నందు రాత్రి బస చేసి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *