Breaking News

ఎపిసిసి స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ గా హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ జంధ్యాల శాస్త్రి నియామకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు శుక్రవారం ఏపీసీసీ స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ గురునాధం చేతుల మీదుగా ఏపీసీసీ స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ గా హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్  జంధ్యాల శాస్త్రి నియమించడం జరిగింది. నియామక పత్రాన్ని అందుకున్న డాక్టర్ జంధ్యాల శాస్త్రి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కి వర్కింగ్ ప్రెసిడెంట్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే  ఆశీస్సులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పజెప్పిన స్టేట్ లీగల్ చైర్మన్ వలిబోయిన గురునాధం కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర అధ్యక్షులు ఏఐసీసీ మెంబర్ నరహరిశెట్టి నరసింహారావు, ఎఐసిసి మెంబర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేడా సురేష్, పీసీసీ కార్యదర్శి పోతురాజు జేసుదాసు, ఏపీసిసి లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ న్యాయవాది పేడూరి సాయిబాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి హెచ్ ఎస్ బేగ్, ఎన్ ఎస్ యు ఐ స్టేట్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ న్యాయవాది వేముల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విజయవాడ నగర ఉపాధ్యక్షులు ఎస్కే అన్సారీ, యుడబ్ల్యూసి విజయవాడ అధ్యక్షులు బూదాల జోసెఫ్, నగర నాయకులు ఎన్.సిద్దయ్య, ఎం.రమణ, సిరిగిడి జనార్ధన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *