-వర్షం కారమంగా ఆర్బీకేల్లో మిగిలిన ధాన్యం ఆఫ్ లైన్ లో కొనుగోలు చేస్తాం
-వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు మధ్య సమన్వయం
-కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
-అధికారులతో, మిల్లర్ల ప్రతినిధులతో అత్యవసర భేటీ
-కలెక్టర్ మాధవీలత, జేసీ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు రైతులను అప్రమత్తం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు అధికారును ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ ఛాంబర్ లో అకాల వర్షాలపై అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఈరోజు నాటికి కోతలు పూర్తిచేసి, కొనుగోలుకు షెడ్యూలింగ్ ఇచ్చిన ధాన్యం మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు సుమారు లక్ష 12 వేల మెట్రిక్ టన్నులలో 1లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి అయిందని, వాటిని మిల్లులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న నాలుగు రోజులు వర్ష సూచన మేరకు కోతలు పూర్తి చేసిన రైతుల నుంచి వారి అంగీకారంతో ఆఫ్ లైన్ ద్వారా కొనుగోళ్ళు పూర్తిచేసి, మిల్లులకు తరలించే విధంగా అధికారులు బాధ్యత చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్ తదితర అధికారులు మధ్య సమన్వయం తో కొనుగోళ్లు పూర్తి చేసి, రైతులకు భరోసా కల్పించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం వర్షాలు పడుతన్నందున రైతులు వరి కోతలు కోయవద్దని, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో లో వుండి దైర్యం చెప్పాలని కలెక్టర్ మాధవీలత అధికారులను ఆదేశించారు. ఆర్బీకేల వారీ ప్రతి రెండు గంటలకు ఎంత ధాన్యం వస్తుందో పర్యవేక్షించాలన్నారు.
ఇప్పటి వరకు షెడ్యూలు అయిన ధ్యాన్యాన్ని ఆన్ లైన్ ద్వారా మిల్లర్లు పంపడం జరుగుతుందని, వర్షం కారణంగా ఆర్భీకెలు వారి మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆఫ్ లైన్ ద్వారా షెడ్యూల్ చేసి మిలర్స్ పంపడం జరుగుతుందన్నారు. ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా అధికారులు, మిల్లర్లు ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలన్నారు. గన్ని బాగ్స్ కొరత లేకుండా మిల్లర్లు సహకరించి ధాన్యం వెంటనే దిగుమతి చేయాలన్నారు. గ్రామాలవారీ రైతుల షెడ్యూలింగ్ ప్రకారం ఇప్పటి వరకు ఎంత హార్వెస్టింగ్ జరిగింది, ఎంత ధాన్యం పోక్యూర్ మెంట్ అయ్యింది, రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మండలం ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎమ్.పి.డీ.ఓ లు ఆయా మండలాలు వారి ఆర్. బీ. కే ల్లోని కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తుందన్నది పర్యవేక్షణ చేసి రిపోర్టు సమర్పించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటిస్తూ ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా రైతు కు దైర్యం చెప్పి అప్రమత్తం చెయ్యాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ షెడ్యూల్ పూర్తి చేసిన వాటికి అనుగుణంగా ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులను సిద్దం చేసుకోవాలన్నారు. ఇంకా కోతలు పూర్తి అవ్వని వారు వాతావరణ మార్పులు నేపథ్యంలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. మండల ఆర్బీకేల్లో అగ్రి ఎడ్వజరీ బోర్టు సమావేశాలు ఏర్పాటుచేయాలన్నారు. ట్రాన్స్ పోర్టు, ఎగుమతి, దిగుమతి, గన్నిబ్యాగ్సు సప్లే విధానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిల్లర్లు సహకరించాలని కోరారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షపాతానికి వరి పంటలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో వరి 55079 హెక్టార్ల సాగులో వుండగా ఇప్పటివరకు 63శాతంతో 34503 హెక్టార్లలో కోతలు పూర్తయయన్రు.. ఈరోజు ఉదయం నుండి వర్షాలు కారణంగా పొలం లో కోయని వరికి ఏటువంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. కోతలు జరిగిన ముఖ్య వరి రకాలలో RNR 15048 ఓపెన్ మార్కెట్ లో అధిక డిమాండ్ ఉండుటవలన 4292 హెక్టార్లలో వచ్చిన 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి యంఎస్ పి కంటే అధిక ధరకు అమ్ముడవు చున్నాయని తెలిపారు. ముఖ్య రకాయయిన MTU- 1121 & MTU-1156 ప్రభుత్వము కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటివరకు 84,500 Mts కోనుగోలు చేయుట జరిగినదని, కొనుగోలు ప్రక్రియ నిరంతరం జరుగుతూ వున్నదన్నారు. రైతులు కళ్ళాల్లో వున్న ధాన్యాన్ని టార్పలిన్ తో కప్పుకొని తడవకుండా జాగ్రత చేసుకుని సురక్షిత ప్రదేశానికి తరలించి, మిల్లుకి షెడ్యూల్ ప్రకారం పంపిణి చేయాలన్నారు. ఇప్పటి వరకు కోయని పొలం లో వున్న వరిని కోత చేయకుండా వర్షాలు తగ్గేవరకు కోయవద్దని, పొలంలోని నీరు బయటకు పొయే విధముగా రైతులు తగని జాగ్రత తీసుకొవాలన్నారు. ధాన్యం మొలక రాకుండా 5శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసి మొలక రాకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డిఆర్వో జి. నరశింహులు, జేడీ వ్యవసాయ శాఖ ఎస్. మాధవరావు, సీపీవో ప్రకాశరావు, డీఎస్ఓ ప్రసాధరావు, డీఎం సివిల్ సప్లై అధికారి నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News