Breaking News

శరద్‌ పవార్‌ సేవలను వినియోగించుకుంటాం

-ఆయన చూపిన మార్గంలో పయనిద్దాం
-నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ మంగళవారంనాడు గుంటూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తన పదవికి రాజీనామా చేశారని, ఆయన సేవలు కొనసాగించాలని దేశ వ్యాప్తంగా ఎన్‌సిపి నాయకులు, కార్యకర్తలు కోరుకుంటు-న్నా ఆయన అందుకు అంగీకరించటం లేదన్నారు. పార్టీలో కొత్తవారికి పదవులకు అవకాశం కల్పిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం సహేతుకమైనదని అన్నారు. ఆయన పదవికి దూరమవుతున్నాను కాని ప్రజలకు దూరం కానని అనడం ఆయన మంచితనానికి నిదర్శనం అన్నారు. రాజకీయ దురంధరుడు, దేశంలోనే సీనియర్‌ రాజకీయ నేత, పార్టీని ముందుండి నడిపించిన మహానేత, మార్గదర్శకుడు అయిన శరద్‌ పవార్‌ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీ అత్యున్నత పదవి నుంచి తప్పుకోవడం పార్టీకి చాలా ఇబ్బందికరం. ఆయన నాయకత్వంలో ఎదిగిన ఎంతో మంది నాయకులు ఆయన నిర్ణయానికి హతాశులయ్యారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆయన సలహాలు సూచనలతో మరింత ముందుకు వెళ్ళాలని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేస్తామని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *