గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వారం రోజులపాటు వీధి దీపాల పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు, విధ్యుత్ లైన్ ఉండి స్తంభాలకు ఉన్న వీధి దీపాలు వెలగని వాటిని వెంటనే పునరుద్దరించనున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, బుధవారం నుండి ప్రత్యేకంగా వీధి దీపాల సమస్యల పరిష్కారం కోసం వారం రోజులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. నగర ప్రజలు తమ ప్రాంతంలో స్తంభాలు ఉండి లైట్లు వెలగకుంటే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103, 104 నంబర్లకు లేదా 9849908391 నంబర్ కు వాట్స్ అప్ చేయవచ్చని తెలిపారు. కాల్ సెంటర్ లో వీధి దీపాల పై అందే ఫిర్యాదులు, వాటి పరిష్కారం పై ప్రత్యేకంగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే క్షేత్ర స్థాయిలోని నగరపాలక సంస్థ లైన్ మెన్ లు తమ పరిధిలో వీధి దీపాల పై నివేదిక ఇవ్వాలని, విధ్యుత్ విభాగ ఏ.ఈ., డి.ఈ.ఈ., ఈ.ఈ.లు పెట్రోలింగ్ చేసి, ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News