Breaking News

వసతి గృహాలను తనిఖీ చేసిన డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి ప్రత్యూష కుమారీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ప్రకాష్ నగర్ లోని కె.వి. స్టేట్ హోం ను సందర్శించి అక్కడ వసతులని పరిశీలించారు. అనంతరం బాల సదనమును సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. వారికి అక్కడ అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగినుల వసతి గృహమును సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. అనంతరం బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శించిన న్యాయమూర్తి అక్కడి వసతులను పరిశీలించి బాలురుతో కాసేపు మాట్లాడారు. శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. న్యాయ మార్గాన్ని అనుసరిస్తే జీవితంలో ప్రశాంతత, గౌరవం లభిస్తాయని లేదంటే జీవితం దుర్బలం అవుతుందని వివరించారు. వారికి ఎలాంటి న్యాయ సేవలు కావాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి తెలియజేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *