విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చెర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ అనాదిగా ఈ దేశ సంస్కృతికి మూలస్థంభంలా నిలిచింది విశ్వకర్మలేనని, ఈ నవీన యుగంలో దేశవ్యాప్తంగా సమాజ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్న విశ్వకర్మ మహనీయుల్ని గుర్తించి వారిని సన్మాన పూర్వకంగా గౌరవించుకునే కార్యక్రమమే ఈ విశ్వకర్మ లెజెండరీ అవార్డ్స్ అని, ఏటా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నందుకు రాష్ట్రం నలుమూలల నుండి విశ్వకర్మలు తరలివచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వకర్మ లెజెండరీ అవార్డ్స్ – 2023 మరియు విశ్వకర్మ నేషనల్ సమ్మిట్ ఈ సంవత్సరం మే నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి వెంకట్ విశ్వకర్మ తెలియజేసారు. ఈ కార్యక్రమానికి దాదాపు 10 రాష్ట్రాల నుండి విశ్వకర్మ సమాజ ప్రతినిధులు, పురస్కార గ్రహీతలు పాల్గొంటారని, విశ్వకర్మ సమాజ సంస్కృతి, సంక్షేమం, అభివృద్ధి మొదలగు రంగాల్లో విశేషమైన కృషి చేసినవాళ్లకు ఈ పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి నాటక ప్రదర్శన, రుంజ వాద్య శబ్ద విన్యాస తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మరిన్ని వివరాలకు 9966102201 నెంబరులో సంప్రదించాలని కోరారు.
Prajavartha Online Telugu News