Breaking News

మంత్రి క్యాంపు కార్యాలయంలో 2023-24 సంక్షేమ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హోం మంత్రి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృతక్వంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ నెలలో ఏ సంక్షేమ పధకం లబ్ది అందిస్తున్నామన్నది, సంక్షేమ క్యాలండరీ ద్వారా ముందుగానే ప్రకటించి, తదానుగుణంగా సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా అర్హులైన లబ్దిదారుల ఖాతాలకు జమ చేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం స్థానిక హోమ్ మంత్రి క్యాంపు కార్యాలయంలో 2023-24 ప్రభుత్వ సంక్షేమ క్యాలెండరీని మంత్రి తానేటి వనిత ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ అధికారం లోనికి వచ్చిన 45 నెలల్లోనే రు.2,96,148.09 కోట్ల మేర సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారన్నారు. ఆమేరకు ఏ నెలలో ఏ సంక్షేమ పథకం అందించనున్నామో వార్షిక ప్రణాళిక సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచడం జరిగిందన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరపు సంక్షేమ క్యాలెండరీ..
అందులో భాగంగా 2023 – ఏప్రిల్ జగనన్న వసతి దీవెన, వైయస్సార్ ఈ బీసీ నేస్తం (రెండో ఏడాది ) ఇప్పటికే అందజేసినట్లు హోం మంత్రి పేర్కొన్నారు. మే నెలలో వాలంటీర్లకు వందనం, వైయస్సార్ రైతు భరోసా పిఎమ్ కిసాన్ (మొదటి విడత), ఉచిత పంటల భీమా, జగనన్న విద్యా కానుక (మొదట విడత), వైయస్సార్ కళ్యాణమస్తు / షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైయస్సార్ మత్స్యకార భరోసా, జూన్ నెలలో జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, వైయస్సార్ లానేస్తం (మొదటి విడత), డిసెంబర్ నుండి మే వరకు అమలైన పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి, జూలై మాసంలో జగనన్న విద్యా దీవెన (మొదటి విడత) వైయస్సార్ నేతన్న నేస్తం, ఎం.ఎస్.ఎం.ఈ లకు ప్రోత్సాహకాలు, జగనన్నతోడు (మొదటి విడత) వైయస్సార్ సున్నావడ్డీ (మహిళలు)వైయస్సార్ కళ్యాణమస్తు/ షాదీ తోఫా (రెండో త్రైమాసికం), ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన ( రెండో విడత)కాపు నేస్తం వైయస్సార్ వాహన మిత్ర, సెప్టెంబర్ నెలలో వైయస్సార్ చేయూత, అక్టోబర్ నెలలో వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ (రెండో విడత), జగనన్న వసతి దీవెన ( మొదటి విడత), నవంబర్ నెలలో వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైయస్సార్ కళ్యాణమస్తు/షాదీ తోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడో విడత), డిసెంబర్ నెలలో జగనన్న విదేశీ విద్యా దీవెన (రెండవ విడత) జగనన్న చేదోడు, జూన్ నుండి నవంబర్ వరకు అర్హులైన లబ్ధిదారుల్లో మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ది, 2024 జనవరి నెలలో వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ (మూడో విడత) వైయస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండో విడత) వైయస్సార్ లానేస్తం (రెండో విడత) వైయస్సార్ పెన్షన్ కానుక, ఫిబ్రవరి నెలలో జగనన్న విద్యాదీవెన (నాల్గవ విడత), వైయస్సార్ కళ్యాణమస్తు/షాదీ తోఫా (నాల్గవత్రైమాసికం), వైయస్సార్ ఈ బీసీ నేస్తం (మూడో విడత), మార్చి నెలలో జగనన్న వసతి దీవెన (రెండో విడత) మరియు ఎం.ఎస్.ఎం.ఈలకు ప్రోత్సాహకాలను లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *