Breaking News

సుడాన్ నుండి భారతదేశం చేరుకున్న 98 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసులు – APNRTS

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుడాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో “ఆపరేషన్ కావేరి” ద్వారా కేంద్రప్రభుత్వం భారతీయులను స్వదేశానికి తీసుకోస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం డిల్లీలో ఏపీ భవన్ అధికారులు, APNRTS, జిల్లాల అడ్మినిస్ట్రేషన్ అధికారులు మన రాష్ట్ర వాసులను ఆయా విమానాశ్రయాల నుండి స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఇప్పటి వరకు స్వదేశం చేరుకున్న 98మంది రాష్ట్ర వాసులలో 97 మంది సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకోగా, మరొకరు (01) రేపు ఉదయం విజయవాడ చేరుకోనున్నారు.

న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ విమానాశ్రయాలకు చేరుకున్న అందరిలో 6౩ మందిని రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ప్రయాణ, ఇతర సదుపాయాల ఏర్పాట్లు చేసి, అక్కడి నుండి విమాన మార్గం, రోడ్డు మార్గం ద్వారా ఏపీ భవన్ అధికారులు, APNRTS అధికారులు… జిల్లాల అడ్మినిస్ట్రేషన్ అధికారుల సహకారంతో వారి వారి స్వస్థలాలకు చేర్చడం జరిగిందని APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. మిగిలినవారు, వారు పనిచేస్తున్న సంస్థల ద్వారా వారి వారి ఇళ్ళకు చేరుకున్నారన్నారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ – సాధారణ పరిపాలన శాఖ (Poll-C) శ్రీ ముత్యాల రాజు, ఐఏఎస్ గారి పర్యవేక్షణలో నిరంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ. హిమాన్ష్ కౌషిక్, APNRTS సీఈఓ శ్రీమతి. పి. హేమలత రాణి, జిల్లాల అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరియు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని శ్రీ వెంకట్ గారు తెలిపారు.

05.05.2023 వ తేదీ వరకు షెడ్యూల్ అయిన విమానాల్లో APNRTS ద్వారా రిజిస్టర్ చేసుకున్న మరియు చేసుకోని మొత్తం ఏపీవాసులందరినీ క్షేమంగా తమ ఇళ్ళకు చేర్చడం జరిగింది. ఇళ్ళకు చేరుకున్న రాష్ట్రవాసులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో తమను తమ, తమ ఇళ్ళకు క్షేమంగా చేర్చిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశంసిస్తూ, కృతఙ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *