Breaking News

హనుమాన్ జంక్షన్ లోని బొమ్మలురూ లో జరుగుతున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనుల నాణ్యత పరిశీలన

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకముగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనము పనులలో భాగంగా హనుమాన్ జంక్షన్ లోని బొమ్మలురూ గ్రామంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ తయారీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  ఐ.ఏ.ఎస్. ఈ సందర్భములో బొమ్మలురూ లో జరుగుచున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ తయారీ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని, ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని.. ఎక్కడ పొరపాట్లు లేకుండా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరగాలని సూచించారు. ప్రధాన విగ్రహం తో పాటు మిగిలిన పనులు సైతం సమయంలోపు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో, విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *