రాజమహేంద్రవరం :నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందన సందర్భంగా 11 మంది అర్జీలని ఇవ్వడం జరిగిందని అదనపు డిప్యూటీ కమిషనర్ పి ఎం సత్యవేణి పేర్కొన్నారు.సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు డిప్యూటీ కమిషనర్ పి ఎం సత్యవేణి, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.పాండు రంగారావు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు డిప్యూటీ కమిషనర్ పి ఎం సత్య వేణి, మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా ప్రజలను త్రాగునీటిని అందించే దిశలో చలి వేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని పేర్కొన్నారు. ప్రజలనుంచి వస్తున్న అర్జీల పరిష్కారం కోసం జవాబుదారీతనం ఉండటం ముఖ్యం అని స్పష్టం చేశారు.వి ఎల్ పురం కి చెందిన వై ఏ కళావతి ఎస్ ఎన్ పురం రోడ్డు లో ఉన్న వీధి దీపాలు మూడు నెలలుగా వెలగడం లేదని అర్జి అందచేశారు. హోతా వారి వీధిలో చిన్నపాటి వర్షం వొచ్చిన నీరు నిలిచి పోతోందని, కాలువలో మట్టి పేరుకుని ఉన్నట్లు ఎస్. సత్యనారాయణ మూర్తి తెలిపారు.శారద నగర్ వార్డ్ 9 లో నిర్మించిన సిమెంట్ రోడ్ నకు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని ఈ. జనార్ధన్ కోరారు. త్రాగునీటి సమస్య, శానిటేషన్, కుళాయి , ఇతర పన్నులు పై అర్జీలు ఇవ్వటం జరిగింది.
Prajavartha Online Telugu News