Breaking News

టిడిఆర్ బాండ్లు ఇవ్వడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రోడ్ల విస్తరణ జరిగిన ప్రాంతాల్లో నిబందనల మేరకు టిడిఆర్ బాండ్లు ఇవ్వడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ పనులు జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వ నిబందనల మేరకు మంజూరు చేయాల్సిన టిడిఆర్ బాండ్లు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇవ్వలేదని, వాటిని వెంటనే ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఏటి అగ్రహారం పనులు వేగంగా జరగాలని, విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు వసూళ్లు తక్కువగా ఉండటం పై ఆగ్రహం వ్యక్తం చేసి, ఏసిపిల వారిగా ఈ నెలాఖరు నాటికి వసూళ్లు నూరు శాతం జరిగేలా కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలన్నారు. భవన నిర్మాణ వ్యర్ధాలను నిర్మాణదారులు ఇష్టానుసారం రోడ్ల మీద వేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి వారి నుండి అపరాధ రుసుం వసూళ్లు చేసి, వ్యర్ధాలను తొలగించాలని సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. రీ సర్వే వేగవంతం చేయాలని, కోర్ట్ కేసుల్లో కౌంటర్లు, అఫిడవిట్లు పక్కాగా నమోదు చేయాలని, కంటేమ్ట్ కాకుండా ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని, కోర్ట్ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేసుల వారిగా ప్రతి వారం సిటి ప్లానర్ సమీక్ష చేయాలని ఆదేశించారు. సమావేశంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్లు మూర్తి, కోటయ్య, ఏ.సి.పి. అశోక్ కుమార్, టి.పి.ఎస్.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *