Breaking News

మార్కెట్లోకి హీరో కంపెనీ సరికొత్త అద్భుతమైన ద్విచక్ర వాహనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ద వెన్యూ కన్వెన్షన్ హాల్ ప్రక్కన ఆర్ ఎం మోటార్స్ హీరో షోరూం నందు నూతనంగా హీరో సూపర్ స్పెండర్ , ఎక్స్ టి ఈ సి , 125 cc ఇంజన్ కెపాసిటీ గల టూవీలర్ వాహనాన్ని జనరల్ మేనేజర్ మహేష్ నూతనంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా షోరూం సేల్స్ మేనేజర్ నీతున్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజే హీరో కంపెనీ వారు దేశం మొత్తం మీద అన్ని షోరూమ్ లో సూపర్ స్పెండర్ ఎక్స్ టి ఈ సి, 125 cc కెపాసిటీ గల ఇంజిన్ సరికొత్త మోడల్స్ తో ఈ ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేయడం జరిగిందని తెలిపారు. ద్విచక్ర వాహన ప్రియులకు వినియోగదారులకు, హీరో కంపెనీ వినియోగదారులకు అభిరుచికి తగ్గట్టుగా ప్రస్తుతానికి ఈ సరికొత్త వాహనాన్ని , అన్నిరంగులలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉందని తెలిపారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ద్విచక్ర వాహన వినియోగదారు లను, హీరో అభిమానులను కోరారు. ఇంకా వినియోగదారులకు ఈ వాహనంపై ఎటువంటి సందేహాలు ఉన్న నేరుగా షోరూం వచ్చి తెలుసుకోవలసిందిగా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *