Breaking News

డెంగ్యూ వ్యాధి నివారణకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వ్యాధి నివారణకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణా కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ప్రచార గోడ పత్రికల (వాల్‌ పోస్టర్ల)ను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విడుదల చేశారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఆడ ఈడిస్‌ దోమకాటుతో వైరస్‌ ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ళనొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటివి డెంగ్యూ వ్యాధి లక్షణాలుగా గుర్తించవచ్చునన్నారు. ఈ దోమలు పగటిపూట ఇంటి లోపల ఆవరణలో సంచరించి కుట్టడం జరుగుతుందన్నారు. వీటి నివారణకు దోమలు వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వృధా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని వాడిన టైర్లు, పనికి రాని వస్తువులు, వాడిన కొబ్బరి బొండాలు, చిప్పలు తదితర వాటిలో నిరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. నీటి ట్యాంకులపై మూతలు ఉంచాలని, మురుగునీరు, ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఫాగింగ్‌, ఆయల్‌బాల్స్‌ వెదజల్లడం, వంటి చర్యల ద్వారా లార్వా వ్యాప్తి చెందకుండా నివారించ వచ్చునన్నారు. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడడం ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. డెంగీ వ్యాధి నుండి రక్షణ పొందేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రజల భాగస్వామ్యంతో దోమలను నివారించుకుని వ్యాధి నుండి రక్షణ పొందాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. అవగాహన పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, ఇన్‌చార్జ్‌ డియంవో నరసింహా నాయక్‌, బయాలజిస్ట్‌ సూర్యకుమార్‌, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *