Breaking News

శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిని కలిసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే అవకాశం ఒక్క ఆధ్మాత్మికతతోనే లభిస్తుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామిని బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సున్నపుబట్టీల సెంటర్ లోని ఒక ప్రైవేట్ నివాసంలో బస చేసిన స్వామీజిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. స్వామిజీని దర్శించుకోవడం మహాభాగ్యమని మల్లాది విష్ణు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశాఖ శ్రీ శారదాపీఠం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కొనియాడారు. శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని.. పీఠం ద్వారా సమాజ సేవలో తరిస్తున్నారని కొనియాడారు. స్వామిజీని కలిసిన వారిలో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గమ్మ ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *