విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ అన్నారు..పేదవారికి అరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందని పక్షంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేస్తున్నామని తెలిపారు..మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేసిన ఘనత సీఎం జగన్ సొంతమని అయన పేర్కొన్నారు.ఒకపక్క వైస్సార్సీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతుంటే ఆరోగ్య శ్రీ నిధులు నిలిపేశారు అని ప్రతిపక్షాలు వారి అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో టీడిపి నేతలు ప్రభుత్వం పై విష ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారు అని,వారి మాయ మాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరు అయన విమర్శించారు..గుణదల లోని వైసీపీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో 11వ డివిజన్ కి చెందిన జలగం శాంతకుమారికి ముఖ్యమంత్రి సహయనిధి కింద లక్ష రూపాయలు చెక్కును నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ అందజేశారు…ఈ సంధర్బంగా అవినాష్ మాట్లాడుతు పెద వారికి అరోగ్యశ్రీ ద్వార సహాయం అందని పక్షంలో వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు..సీఎం జగన్ పాలనలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగుకుండ అండగా నిలుస్తున్నామన్నరు.. సంక్షేమ పథకాలు నీ నేరుగా లబ్ధిదారుల గుమ్మం వద్దకు చేరుస్తున్నమని అయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే కోట్లాది రూపాయలు అందచేసినట్లు అవినాష్ చెప్పారు.ఇప్పటికైనా టీడీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,సొంగా రాజ్ కమల్,మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News