విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకు చెబుదాం, స్పందన కు అందే ఫిర్యాదులను విభాగాధిపతులే నేరుగా పరిశిలించి పరిష్కరించాలని, ఏ ఒక్క ఫిర్యాదు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన నిర్వహించారు.
కమిషనర్ తొలుత జగనన్నకు చెబుదాం, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి, వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పై అధికారులతో, సంబందిత సిబ్బందితో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి జగనన్నకు చెబుదాం కు అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల నేరుగా రాష్ట్ర స్థాయి అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని, ఫిర్యాదులను భాధ్యతతో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలని, విభాగాల వారిగా జగనన్నకు చెబుదాం ఆర్జీలకై ప్రత్యేక సిబ్బందిని కేటాయించుకోవాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు విభాగాల వారిగా తమ సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలన్నారు. నోడల్ అధికారులు సచివాలయ కార్యదర్శుల పనితీరు, సేవలు, స్థానిక సమస్యలపై పర్యవేక్షణ చేయాలని, ప్రతి సోమవారం నోడల్ అధికారులతో సచివాలయ పనితీరుపై సమీక్షా చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
సోమవారం నిర్వహించిన స్పందనలో 46 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 18, ఇంజినీరింగ్ విభాగం 14, రెవెన్యూ విభాగం 4, ప్రజారోగ్య విభాగం 6, ఉపా సెల్ విభాగంకి సంబధించి 1, అకౌంట్స్ విభాగం సంబంధించి 2, పరిపాలన విభాగానికి సంబందించి 1 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్, ఏడిహెచ్ రామారావు, బయాలజిస్ట్ మధుసూదన్, మేనేజర్ శివన్నారాయణ, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సిటి ప్లానర్లు, ఏసిపిలు, ఈఈలు, యస్.యస్ లు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News