-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి మంగళవారం బందరు రోడ్డులోని రాఘవయ్య పార్కు దగ్గర నిర్మాణం చేపడుతున్న నిర్మల్ వృదయ్ భవన్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణాన్ని కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ పరిశీలిచారు. డ్రైనేజీ లో ఎటువంటి చెత్తను గాని రాళ్ళను వెయ్యకుండా చూడాలని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. మురుగునీరు సక్రమముగా ప్రవహించే చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ వృదయ్ భవన్ లో జరుగుతున్న సివిల్స్ వర్క్స్ ను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కాంపౌండ్ గోడకు అందమైన చిత్రాలు వేయించాలని అన్నారు. నిర్మల్ వృదయ్ భవన్ లో అదేవిధంగా అందులో గ్రీనరీ మొక్కలను మరియు మొక్కల కుండిలను ఏర్పాటు చేసి పచ్చదనం పెంపు పై ఏ.డి.హెచ్. మరింత దృష్టి సారించాలన్నారు.
Prajavartha Online Telugu News