Breaking News

జగనన్న పాల వెల్లువ కార్యక్రమం క్రింద ఏడు రూట్లలో జిల్లాలో పాల సేకరణ శత శాతం జరిగేలా చూడాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ కార్యక్రమం క్రింద జిల్లాలో చేపట్టిన పాల సేకరణ అన్ని రూట్లలో 100% జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులను, కోపరేటివ్ శాఖ మరియు సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్లో జగనన్న పాలవెలువ కార్యక్రమం అమలు పై సమీక్షిస్తూ జీరో కలెక్షన్ రూట్లు అనేవి ఉండరాదని శత శాతం రిజిస్టర్డ్ పాడి రైతులు అందరూ జె పి వి కింద పాల సేకరణకు సహకరించేలా వారికి రేపు మోటివేషన్ చేసే విధంగా సంబంధిత మండలాల ఏపీఎంలు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఏడు రూట్ల కోపరేటివ్ అధికారులు సమన్వయంతో టీంలు గా కలిసి వెళ్లి వారితో మాట్లాడి అన్ని రూట్లలో పాల సేకరణ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అధికారులు వివరిస్తూ జిల్లాలో 4183 మంది రిజిస్టర్డ్ పాడి రైతులు ఉన్నారని, అందులో 97 మందికి డీసీసీబీ ద్వారా 27.40 లక్షలు రుణాలు అందించామని చేయూత కింద జేపీవీ రైతులకు 844 మందికి, 831 పశువులను అందజేయడం జరిగిందని ఇంకా 2781 పాడి పశువులను అందించాల్సి ఉందని తెలుపగా డిఆర్డిఏ సంఘాల ద్వారా మరియు ఎల్డిఎం సహకారంతో వివిధ బ్యాంకుల నుండి చేయూత త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పుత్తూరు 25 ఏఎంసీయూల ద్వారా, వడమల పేట 32 ఏఎంసీ యు ల ద్వారా నారాయణవనం 22 ఏఎంసియు ల ద్వారా మొత్తం 79 బి ఎం సి యూ లో ద్వారా పాల సేకరణ జరుగుతుందని తెలుపగా అదనంగా పాల సేకరణకు బి ఎన్ కండ్రిగ ఎల్ ఎం కండ్రిగ, రామకృష్ణా పురం, తిరుమంజనం తదితర ప్రాంతాలలో సరియైన పాల సేకరణ అంచనాలతో ప్రతిపాదనలు జగనన్న పాలవెల్లువ విస్తరణ కింద చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవికుమార్ జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సూపర్డెంట్ వెంకటరమణ, డి ఆర్ డి ఏ పి డి జ్యోతి, రూట్ ఇన్చార్జ్ అధికారులు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *