Breaking News

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో అమ్మ పార్టీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో, చట్టసభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం లభిం చడం లేదన్నారు. మహిళా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా తమ పార్టీ ముందుకు సాగుతుందని అమ్మ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ ఎస్. సుప్రవీణ తెలిపారు. బుధవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో అమె మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లో మహిళా ప్రాతినిధ్యం సక్రమంగా లేదని, చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యం కోసం ఉద్యమిస్తామన్నారు. మా పార్టీ 20 సూత్రాల ప్రణాళికను అమలు చేస్తామన్నారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జి బిఎన్ రాజు మాట్లాడుతూ విధులు, బాధ్యతలతో కూడిన హక్కులను ప్రజలకు అందించేందుకు అమ్మ పార్టీ 20 సూత్రాల ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో మహిళా అభ్యర్థులనే పోటీచేయిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రస్తుత ప్రభుత్వ పాలనపై విసిగిపోయారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పక్కన పెట్టి పంట దోపిడీ చేసి పరిగ ప్రజలకు పంచినట్లు పాలన సాగిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, అమ్మ పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. మహిళలు రాజకీయ ఉనికిని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని, జనాభాలో సగ బాగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో 10 శాతం కూడా ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పార్టీ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అనంతరం పలు జిల్లాకు ప్రతినిధులను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎస్. సురేంద్రరెడ్డి, వప్పతొట్టి రమేష్, టి.యోహాను, పొట్లూరి కృష్ణారావు, బైర హనుమంతరావు, ఎసిడి రహమ తున్నీసా, ఎసిడి నురుద్దీన్, వప్పతోట్టి సుబాషిణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *