విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మిషన్ క్లీన్ కృష్ణ గోదావరి కాలువుల (MCKGC) లో భాగంగా నగరంలోని మూడు కాలువల ప్రక్షాళనకై నగరపాలక సంస్థ పనులను ప్రారంభించింది. అధనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కే.వి. సత్యవతి పన్నుల్లో పురోగతి పై ఇంజనీరింగ్, హార్టికల్చర్ మరియు శానిటేషన్ డిపార్ట్‌మెంట్‌ల అధికారులతో విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయములో అధనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) చాంబర్ నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలువల ప్రక్షాళన కొరకు మూడు కాలవలకు ముగ్గురు ఎ.ఎం.ఒ.హెచ్ అధికారులను నోడల్ ఆఫీసర్ లను నియమించారు. ఒక్కో కాల్వ శుభ్రపరిచేందుకు 200 మంది పారిశుధ్య కార్మికులను కేటాయించారు. అనంతరం సమావేశంలో RRR కేంద్రాల పురోగతికై మరియు అవగాహనకై ప్రత్యేక డ్రైవ్ మరియు ప్రతి ఇంటికి ప్రచారం చేయమని ఆదేశించారు. వినియోగదారుల నుంచి యూసర్ ఛార్జీల వసూళ్ళ మెరుగుపరచటానికి ప్రత్యేక డ్రైవ్‌ల ఏర్పాటు చెయ్యమని ఆదేశించారు.
Prajavartha Online Telugu News