Breaking News

జిల్లా రెవిన్యూ విభాగంలో ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్, ఇ-డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోండి…

-జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా రెవిన్యూ విభాగంలో ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్ టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరిలో ఖాళీగా ఉన్న ఒక పోస్టును ఓసీ అభ్యర్థి , నందిగామ, తిరువూరు డివిజన్ నందు ఇ-డివిజనల్ మేనేజర్ల కు సంబంధించి ఖాళీగా ఉన్న 2 పోస్టుల్లో 1 ఓసీ అభ్యర్థి, 1 ఎస్ సి మహిళా అభ్యర్థులను కంట్రాక్టు పద్దతిలో నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్, ఇ- డివిజనల్ మేనేజర్ పోస్టుల నియామకానికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు జులై 1వ తేదీ 2022 నాటికీ 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. బీసీఏ , బి ఎస్ సి, బిఈ, బి. టెక్, మాస్టర్ డిగ్రీ విద్య అర్హత కలిగి ఉండాలన్నారు. నిర్ణీత గడువులో ధరఖాస్తు చేస్తుకున్న అభ్యర్థుల ధరఖాస్తులను పరిశీలించి అర్హత గల అభ్యర్థులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. వ్రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపికచేయడం జరుగుతుందన్నారు. ఐటీ సెక్టార్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమయంలో 5 శాతం వైటేజ్ మార్కులు కల్పించడం జరుగుతుందన్నారు. పై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు విధులలో చేరిన నాటి నుండి 1 సంవత్సరం కాలం పాటు పదవిలో కొనసాగించపడతారని విధి నిర్వహణలో చూపిన పనితీరు ఆధారంగా ప్రభుత్వ నిబంధల మేరకు ఆయా పోస్టుల్లో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. తప్పుడు సమాచారం తో ధ్రువ పత్రాలను సమర్పించే అభ్యర్థుల ధ్రువ పత్రాలను తిరస్కరించబడుతుందన్నారు. అర్హత గల అభ్యర్థులు వారి బయోడేటా తో పాటు విద్యార్హత కుల ధృవీకరణ పత్రాలతో దరఖాస్తులను జూన్ 6వ తేదీ లోపు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారి పేరున రిజిస్టర్ పోస్టున దరఖాస్తులను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *