Breaking News

దశల వారీగా చేపట్టవలసిన పనులను పూర్తి చేసాం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ మెడికల్ కమిషన్ ప్రమాణాలకు తగినట్లుగా దశల వారీగా చేపట్టవలసిన పనులను పూర్తి చేశామని, ఆమేరకు తనిఖీ కి వచ్చిన బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, వైద్య బోధనాసుపత్రి సూపరింటెండెంట్ డా ఆర్. రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా ఏ. వేంకటేశ్వర రావు పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం స్థానిక జిజిహెచ్ కార్యాలయం సూపరింటెండెంట్ ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా ఏ. వేంకటేశ్వర రావు మాట్లాడుతూ, రాజమహేంద్రవరం లో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ఎన్ ఎమ్ సి సభ్యుల బృందం రెండు సార్లు పర్యటించడం జరిగిందన్నారు. ఆ సందర్శన లో భాగంగా వారు సిఫార్సు చేసిన పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. తనిఖీ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారని, ఈ ఏడాది 150 సీట్ల తో తొలి ఏడాది మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో పర్యటించిన తనిఖీ బృందంలో డా అనిల్ శివ శంకర్ రాహుల్ సమన్వయ కర్త గా   డా. నిభా బాషి, డా కపూర్ చంద్ర మీనా ముగ్గురు సభ్యులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

జిజిహెచ్ సూపరింటండెంట్ డా . ఆర్ రమేష్ వివరాలు తెలుపుతూ, రాజమహేంద్రవరం లో సుమారు రూ.435 కోట్ల తో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి అనుబంధంగా వైద్య కళాశాల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా తొలి ఏడాది కి సంబంధించి 150 మంది వైద్య విద్యార్థులు మొదటి బ్యాచ్ గా తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జాతీయ మెడికల్ కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు తొలి ఏడాది భోధనాసుపత్రి కి అనుగుణంగా నిర్మాణాలు, వసతులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో ఎన్ ఎమ్ సి కమిటీ సభ్యులు పర్యటించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆమేరకు వారు సూచించిన పనులు పూర్తి చేసి నివేదిక అందచేశామన్నారు. వాటిని క్షేత్ర స్థాయి లో నిర్ధారణ చేసుకోవడం కోసం సోమవారం ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారన్నారు. వారి పర్యాటన సమయంలో మేము ఇచ్చిన నివేదికతో సంతృప్తి వ్యక్త పరచడం జరిగిందని, ఈ ఏడాది 150 మెడికల్ సీట్లు తో తొలి బ్యాచ్ ప్రారంభం అవుతుందని నాలుగైదు రోజుల్లో వాటికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని డా రమేష్ తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాల్లో రాబోయే రెండు ఏళ్లకు సరిపడే వసతులు కల్పించామని, ఇందుకోసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణాలు సూచనలు మేరకు పూర్తి అయ్యిందన్నారు.

ప్రస్తుతం ఈ బోధనా ఆసుపత్రి స్థాయి ని 350 బెడ్స్ కి పెంచడం జరిగిందన్నారు. రానున్న నాలుగేళ్లలో 600 బెడ్స్ స్థాయి కి ఆసుపత్రిని ఆధునిక వైద్య అందించే సామర్థ్యం మేరకు పెంచడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాదికి 350 బెడ్స్ నుంచి 430, తదుపరి ఏడాది 500 బెడ్స్ కు పెంచుకుంటూ 600 బెడ్స్ స్థాయి కి అభివృద్ధి చేస్తూ అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలను సరఫరా చేశారని అన్నారు. భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా వసతులు, మెడికల్ ఎక్విప్మెంట్ సరఫరా చెయ్యడం జరుగుతుందని రమేష్ తెలిపారు. తదనుగుణంగా అందించే వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుతున్నట్లు తెలిపారు. గతంలో కంటే మరింత మెరుగైన వైద్య సేవల్లో భాగంగా ప్రత్యేక వైద్య సేవలు, పరీక్షలు,  ఐ సి యూ, ఆపరేషన్స్, వార్డ్స్ ఆధునీకరించి నట్లు తెలియ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయని డా రమేష్ తెలిపారు.  ఎన్ ఎమ్ సి మార్గదర్శకాల మేరకు నిర్దేశించిన వసతులు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు తదితర వైద్య పరంగా అవసరాలకు అనుగుణంగా ఇండెంట్ ప్రకారం వాటిని సరఫరా చేస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయని డా రమేష్ తెలిపారు.  ఎన్ ఎమ్ సి మార్గదర్శకాల మేరకు నిర్దేశించిన వసతులు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు తదితర వైద్య పరంగా అవసరాలకు అనుగుణంగా లెటర్ ఆఫ్ పర్మిషన్ ప్రకారం వాటిని సరఫరా చేస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సమావేశంలో డాక్టర్లు నాగరాజు మన్నార్, మనోజ్, మహేంద్ర, కే. శ్రీనివాసరెడ్డి, బీ. రాజేశ్వరి, ఏ. వెంకటలక్ష్మి, కె. అక్కమంబా, శైలజ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *