అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం పాల్గొన్నారు. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం వేదపండితులు నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు శాంతి యజ్ఞంలో డిప్యూటీ సీఎం (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యనారాయణపాల్గొన్నారు. శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
Prajavartha Online Telugu News