-హెచ్ సి ఎల్ టెక్ బీ కార్యక్రమం ద్వారా ఐటి రంగంలో ముందస్తు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆసక్తిగల అభ్యర్థులు నమోదు చేసుకోవాలి : కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్ సి ఎల్ టెక్ బీ అనేది 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు ఐటి రంగంలో భారతదేశపు అతిపెద్ద IT కంపెనీలలో ఒకటైన HCL Technologies తమ టెక్ బీ (HCL TechBee program) ప్రోగ్రాం ద్వారా అభ్యర్థులు ఉద్యోగముతోపాటుగా డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటానికి ఇది ఉత్తమ అవకాశం అని ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్హతలు :
ఇంటర్మీడియట్ నందు 2021/2022వ సంవత్సరంలో 60% మార్కులతో ఉతిర్ణత సాధించిన విద్యార్థులు మరియు 2023 వ సంవత్సరంలో 75% మార్కులతో ఉతిర్ణత సాధించిన విద్యార్థులు ఈ ప్రోగ్రాం కి అర్హులు.
ఎలా నమోదు చేసుకొవాలి?
అర్హులైన అభ్యర్ధులు http://bit.ly/techbee22 లింక్ ద్వారా ముందుగా రిజిస్టర్ చేసుకోవలెను. రిజిస్టర్ చేసుకున్న అనంతరం వాళ్ళకు HCL నుండి వచ్చిన మెయిల్ లోని సంబంధిత లింక్ పైన క్లిక్ చేసి, అప్లికేషన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లో అభ్యర్థికి సంబందించిన వివరాలు మరియు అభ్యర్ధి యొక్క ఫోటో, ఆధార్ కార్డ్, సంతకం,10వ తరగతి మార్క్స్ లిస్ట్ మరియు ఇంటర్మీడియేట్ మార్క్స్ లిస్ట్ కాపీలు పొందుపరచాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియలో కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ CAT (Career Aptitude Test) పరీక్ష అనగా అభ్యర్థులకు క్వాంటిటేటివ్-10 మార్కులు, లాజికల్ రీజనింగ్ -10 మార్కులు & వెర్బల్ -10 మార్కులు పై ఆన్లైన్ లో ౩౦ నిముషాల వ్యవధి లో ఆబ్జెక్టివ్ పరీక్ష తిరుపతిలో జూన్ నాలుగవ వారంలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో ప్రతీ సెక్షన్ లో 4 మార్కులు ఖచ్చితంగా వచ్చిన యెడల అభ్యర్ధి తదుపరి రౌండ్ కి ఎంపిక అవుతాడు. CAT పూర్తి అయిన తర్వాత ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కొరకు 25 నిముషాల పాటు వ్యాసరచన ఉంటుంది. పై రెండిటిలో ఉత్తీరుణులైనటువంటి అభ్యర్థులకు HR ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడ ఎంపిక అయిన అభ్యర్ధులు HCL నుండి TechBee ప్రోగ్రాంలో చేరుటకు ఆఫర్ లెటర్ ని పొందుతారు.
ఈ TechBee ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క కాలపరిమితి ఒక సంవత్సరం వుంటుంది. మొదటి 6నెలలు తరగతి గదిలో టీచింగ్ (ప్రస్తుతం ఇంటి వద్దనే) వుంటుంది. అభ్యర్ధులకు అవసరమైన లాప్టాప్ (Laptop) మరియు ఇంటర్నెట్ కొరకు నెలకు రూ.650/- HCL వాళ్ళు అందిస్తారు. చివరి 6 నెలకు అభ్యర్థి ఇంటర్న్షిప్ కొరకు నిర్దేశించిన HCL క్యాంపస్ కి వెళ్ళవలసి వుంటుంది. ఇంటర్న్షిప్ సమయంలో అభ్యర్థికి నెలకు రూ.10,000/- చెప్పున అందించబడుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్ధికి ఉద్యోగిగా మారిన అనంతరం సంవత్సరంకు రూ.1.72 నుండి 2.2 లక్షల జీతాన్ని పొందవచ్చు.
ఇతర వివరములు
HCL TechBee ట్రైనింగ్ ప్రోగ్రాం కొరకు అభ్యర్దులు రూ.1,18,000/- (అనగా 1,00,000 + 18,000 GST) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్థికంగా వెనుకబడిన వారు మొత్తం చెల్లించలేని పరిస్థితిలో రూ.30,000/- చెల్లించి మిగిలిన రూ.88,000/- కొరకు Axis Bank వారు అందించే ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ కొరకు అభ్యర్ధి ఎటువంటి అదనపు హామీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు కేవలం HCL వారు అందించే ఆఫర్ లెటర్ సమర్పిస్తే సరిపోతుంది. ఈ లోన్ డబ్బులు, అభ్యర్థి HCL లో ఉద్యోగిగా చేరిన అనంతరం తన నెలవారి జీతంలో EMI రూపంలో తీర్చవచ్చు.
ఉన్నతవిద్య అవకాశము :
అభ్యర్థులు ఇంటర్మీడయట్ అర్హతతో మిగిలిపోకుండా, HCL వారు అభ్యర్థుల ఉన్నత విద్యలో సహకారం అందిస్తారు. HCL , 3 విశ్వవిద్యాలయాలైన బిట్స్ పిలాని , శస్త్ర మరియు అమిటీ (AMITY) తో అనుబంధం కలిగివుంది. ఈ విశ్వవిద్యాలయాల ద్వారా అభ్యర్థులు ఉన్నత విద్యను పొందవచ్చు. వీటి కొరకు ఆర్థికంగా కూడా హెచ్ సి ఎల్ సహకారాన్ని అందిస్తుంది. HCL లో పని చేస్తూ ఉన్నత విద్యను పూర్తి చేసే అభ్యర్థులు మరో 2 సంవత్సరాలు HCL తోనే సేవా ఒప్పందం అమలును స్వీకరించాల్సి వుంటుంది.
అభ్యర్థులు http://bit.ly/techbee22 లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
మరిన్ని వివరాలకు 9032697478, 7675827308, 8074919939, 9963859160 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు అని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News