Breaking News

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జూన్ నెల లక్ష్యాలను సాధించాలి

-ఉద్యాన పంటలు లక్ష్యాల మేరకు సాధించేలా చర్యలు చేపట్టాలి:కలెక్టర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులు ఎంపిడిఓ లు, సహాయ పథక సంచాలకులు, సహాయ ప్రాజెక్టు అధికారుల తో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి పథక సంచాలకులు డ్వామా శ్రీనివాస ప్రసాద్ తో కలిసి వర్చువల్ విధానంలో సమీక్షిస్తూ, ఉపాధి హామీ కూలీల హాజరు శాతం పెరగాలని జూన్ నెల 1.25 లక్షల లక్ష్యం సాధించాలని, హార్టికల్చర్ అభివృద్ధి పై దృష్టి పెట్టాలి అని వర్షాకాలం లోపు ఉపాధి హామీ పనులు లక్ష్యం మేరకు జరిగేలా వేగవంతం చేయాలని, సరాసరి కూలీ రూ.272 కు తగ్గకుండా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు.

మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్లో వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనులలో కూలీల హాజరు నేటికీ సుమారు లక్ష ఉందని, దానిని 1.25 లక్షలకు ఈ వారమైనా సాధించాలని, పని దినాలు పెరగాలని అన్నారు. ఆ దిశగా ఎంపిడిఓ లు పురోగతి సాధించేలా, గ్రామ పంచాయతీ వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత ఏపీఓ తదితర అధికారులతో సమీక్షించుకుని ప్రణాళికా బద్ధంగా పనిచేసి పురోగతి సాధించాలని అన్నారు. హార్టికల్చర్ పనులపై దృష్టి పెట్టి ప్రతి మండలంలోని అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. అంతే కాకుండా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు కూడా నిబంధనల మేరకు కవర్ అయ్యేలా గ్రామ పంచాయతీ వారీగా గుర్తించి వారికి పనులు కల్పించి పని దినాలు మెరుగ్గా కల్పించాలని అన్నారు.

చిన్న గొట్టికల్లు, చంద్రగిరి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తడ పాకాల, చిట్టమూరు, పెళ్లకూరు, బి ఎన్ కండ్రిగ, వాకాడు మండలాలు ఉపాధి హామీ, హార్టికల్చర్ పురోగతిలో తక్కువ ఉన్నారని, పనితీరు మెరుగుపడాలని తెలిపారు.

ఉద్యాన పంటలు వేసుకునే వారికి త్వరిత గతిన ఏపీఎంఐపి ద్వారా డ్రిప్ మంజూరు చేయడం జరుగుతుందని రైతులను ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని తెలిపారు.

జిల్లా లో ప్రస్తుతం సరాసరి కూలీ రూ.260 ఉందని, కానీ ఉండాల్సిన సరాసరి కూలీ రూ.272 అనీ, దీనిని అందిపుచ్చుకుని సరాసరి కూలీ పెరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సంబంధిత మండలం ఏపిఓ బాధ్యులుగా దీనిని గ్రామ పంచాయతీ వారీగా సమీక్షించి సమయానుసారంగా ఎంపిడిఓ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే సమయంలో ఉపాధి హామీ కూలీ చెల్లింపులు సకాలంలో జరగాలని, నిబంధనల మేరకు సరాసరి వేతనం అందేలా చర్యలు ఉండాలని సూచించారు. ఇంకా ఆధార్ అనుసంధానం కాకుండా పెండింగ్ లో ఉన్న 6695 జాబ్ కార్డుల ఆధార్ అనుసంధానం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తిరస్కరించబడిన ట్రాన్సాక్షన్ల రీకన్సిలేషన్ పెండింగ్ ఉండరాదని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా లోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవో, ఏపీడి లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *