Breaking News

ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక కిట్లు అందించేందుకు సిద్ధంగా ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక కిట్లు అందించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న విద్యాకానుక పంపిణీ, గృహ నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై బుధవారం కలెక్టర్ ఢిల్లీరావు మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, తహశీల్దార్లు, గృహ నిర్మాణ శాఖ ఇంజీనీర్లుతో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయని అదే రోజు ప్రతివిద్యార్దికి జగనన్న విద్యాకానుక కిట్లను అందించేలా విద్యాశాఖ అధికారులు ముందుగానే ఆయా మెటీరియల్ ను పాఠశాలలకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ 9వ తేదీలోగా జిలాల్లోని అన్ని పాఠశాలలకు జగనన్న విద్యాకానుక కిట్లను అందించాలని ఇందుకు ఎంపిడివోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలన్నారు. జగనన్న విద్యాకానుకకు సంబంధించి ప్రతి వస్తువును నిర్దేశించిన గడువులోగా పాఠశాలలకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించుకొని, ప్రతివస్తువును మండల కేంద్రాలలో నాణ్యత తనిఖీ చేయాలన్నారు. విద్యాకానుకలో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బేల్ట్లు, యూనిఫామ్, నోట్ బుక్స్, బూట్లు, సాక్సులు, ఆక్స్ ఫోర్డ్ నిఘంటువు ఉంటాయన్నారు. మండల ఎంఈవోలు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సంప్రదించి విద్య కానుక కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 952 పాఠశాలలు ఉన్నాయని వీటిలో 437 పాఠశాలలకు 50 శాతం పైగా విద్యాకానుక కిట్లు అందించడం జరిగిందన్నారు. రేపటి లోగా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, జి కొండూరు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మండల ప్రధాన కార్యాలయాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని కంచికచర్ల, విజయవాడ రూరల్ మండలాలకు నూరు శాతం జగనన్న విద్యాకానుక కిట్లను అందించడం జరిగిందన్నారు. పాఠశాలల పునఃప్రారంభం అయ్యే రోజు విద్యాకానుక కిట్లు అందలేదనే పిర్యాదులు రాకూడదని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా మండలాల విద్యాశాఖ అధికారులను విద్యాకానుక కిట్లపై పూర్తీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ డి ఎ పిడి కె. శ్రీనివాసరావు, డిప్యూటీ డీఈవో రవికుమార్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ జి. మహేశ్వరావు, ఐసీడీస్ పీడీ జి. ఉమాదేవి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ ఆఫీసర్ కొడాలి అనురాధ, జిల్లా మున్సిపల్ కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడివోలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *