విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 225 (ఎస్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. విజయవాడ రాయనపాడు వ్యాగన్ వర్క్ షాప్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సి డబ్ల్యూ ఎం. ఎస్ శ్రీనివాస్, అలయన్స్ క్లబ్స్ జిల్లా గవర్నర్ జి. వెంకటేష్ హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని అలాగే పదిమందికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్14న నిర్వహిస్తున్నారు అని తెలిపారు, అలాగే డెంటల్ క్యాంప్, కంటి పరీక్షలు, గుండె పరీక్షలు ఈసీజీ, టుడి ఏకో పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ గా అలయన్స్ క్లబ్స్ డిప్యూటీ గవర్నర్స్ ఏం. చిన్నారావు, బి. శ్రీనివాస యాదవ్, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రెటరీ రైల్వే శ్రీనివాస్ లు వ్యవహరించారు .ఈ కార్యక్రమంలో అలయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కే. శారదా వాణి, డిస్ట్రిక్ట్ పి ఆర్ ఓ. పి. శ్రీనివాస రావు,ఆంధ్ర హాస్పటల్ డాక్టర్ అచ్యుత బాబు. అమరావతి కంటి ఆసుపత్రి డాక్టర్ నాదెండ్ల వేణు, డాక్టర్ కేతినేని శైలజ . రైల్వే డాక్టర్ సుమలత .డివై సీఎం ఈ రవీంద్రనాథ్.. డబల్యు పి ఓ సుభాష్. సి ఎం టి కాజ,అలయన్స్ ఆర్ సి పి. లలితా రాణి, హనీ క్లబ్ ప్రెసిడెంట్ రబింద్రనాథ్ బెహరా, తదితర అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News