విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్దే నినాదంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతు తో ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. శనివారం 18వ డివిజన్ నందు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో 3 సచివాలయాలకు మంజూరు అయిన గడపగడపకు మన ప్రభుత్వం నిధులు 60 లక్షల రూపాయల నిధులతో తమ్మిన పోతురాజు వీధి, సంగు పేరయ్య గారి వీధి,షేక్ హుస్సేన్ వీధి నందు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. వెంటనే పనులు మొదలుపెట్టి రెండు నెలల లోపు ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలనీలు, డివిజన్ లు అనే తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. టీడీపీ హయాంలో ఈ రాణిగారితోట,సిమెంట్ గౌడౌన్ ప్రాంతాలు ఎలా ఉండేవి ఇప్పుడు వెంకట సత్యం గారు కార్పొరేటర్ అయ్యాక ఎంతగా అభివృద్ధి చెందాయి చూడాలి అని అన్నారు. గత ఐదు సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆ పార్టీ కార్పొరేటర్ లు గెలిచిన ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేసారని, వైసీపీ పార్టీ బలంగా ఉన్న ఈ కృష్ణలంక, గుణదల ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. కానీ నేడు ముఖ్యమంత్రి జగన్ గారు గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని సంకల్పంతో పని చేస్తున్నారు అని తెలిపారు. దానికి అనుగుణంగానే మన నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి కొండ ప్రాంతంలో, కృష్ణలంక ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం గా జాతీయ స్థాయిలో మన విజయవాడ మున్సిపాలిటీ కి స్వచ్ఛత,పరిశుభ్రత లో అనేక అవార్డులు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు దాని చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టి అధినికరించడం జరిగిందని, ఆ వాల్ నిర్మాణం వల్ల ఇటీవల కృష్ణానది కి 5లక్షల క్యూసిక్కుల నీరు వచ్చిన సరే ప్రజానీకం గుండెల మీద చెయ్యిసుకొని నిద్రపోయారని అన్నారు.టీడీపీ లాగా శంకుస్థాపన లు చేసి వదిలేయకుండా వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,దుర్గ గుడి పాలక సభ్యురాలు బచ్చు మాధవి మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …