సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్రమైన బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గ ముస్లిం సోదరసోదరీమణులకు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్‌ అని.. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ చాటి చెబుతుందని.. సన్మార్గంలో జీవనాన్ని కొనసాగించే సందేశాన్ని మానవాళికి అందిస్తుందని తెలిపారు. తమకు ఉన్న దాంట్లో ఇతరులకు పంచిపెట్టడం కంటే మించిన దాతృత్వం లేదనే స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. ఈ పండుగ అందరి జీవితాలలో సరికొత్త ఆనందాలు నింపాలని.. అల్లాహ్ దీవెనలతో నియోజకవర్గ ప్రజలకు సకలశుభాలు కలగాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *