నిష్పక్షపాత పాల‌న‌తో సుస్థిర అభివృద్ధి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-24 వ డివిజన్ 36 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిష్పక్ష పాల‌న‌తో రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధ్యం అయింద‌ని, పేదల జీవ‌న ప్రమాణాలు మెరుగుపడినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 24 వ డివిజన్ 36 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. శిఖామణి సెంటర్, ఆర్.సి.ఎం చర్చి రోడ్డులో విస్తృతంగా పర్యటించి 165 గడపలను సందర్శించారు. డాక్టర్లు, లాయర్లు, వర్తక వ్యాపారస్తులతో మమేకమవుతూ ముందుకు సాగారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రజ‌ల ఇంటి వద్దకే వస్తుండటంతో సుధీర్ఘకాలం స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి సైతం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. సెంట్రల్లోని 96 వార్డు సచివాలయాల పరిధిలో ఇప్పటివరకు 70 సచివావాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకోగా.. దాదాపు రూ. 14 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.

నాలుగో విడత అమ్మఒడి ద్వారా 24,604 మందికి రూ.36.90 కోట్ల లబ్ధి
పేదలకు చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని మల్లాది విష్ణు తెలిపారు. నాలుగో విడత అమ్మఒడి పథకం ద్వారా నియోజకవర్గంలో 24,604 మంది విద్యార్థుల తల్లులకు అక్షరాల రూ. 36 కోట్ల 90 లక్షల 60 వేలు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. పేదరికంలో ఉన్న తల్లులు తమ పిల్లలను బడికి పంపించాలనే గొప్ప ఆలోచనతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మల్లాది విష్ణు తెలిపారు. 2019–20లో పథకం ద్వారా 22,095 మంది తల్లుల ఖాతాల్లో రూ.33.14 కోట్లు నగదు జమ చేయగా.. 2020–21లో 27,170 మంది ఖాతాలలో రూ.40.75 కోట్లు., 2021-22 లో 25,531 మంది ఖాతాలలో రూ.38.29 కోట్లు వరుసగా లబ్ధి చేకూర్చినట్లు తెలియజేశారు. మొత్తంగా నాలుగేళ్లలో రూ. 149.10 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని చెప్పుకొచ్చారు.

రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ అజ్ఞాని దేశంలోనే మరొకరు ఉండరని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పవన్ వన్నీ ప్రగల్భాలు, అసందర్భ ప్రేలాపనలని దుయ్యబట్టారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చిన చంద్రబాబుతో కలిసి అధికారం పంచుకున్న పవన్.. ఉమ్మడి ఆస్తుల విభజన గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడైన చంద్రబాబుతో 2014 లో ఎందుకు జతకట్టారో జనసేన అధినేత సమాధానం చెప్పాలన్నారు. అంతేగానీ రాష్ట్ర ప్రభుత్వంపై అస్తమాను ఏదో ఒకరూపంలో బురద చల్లుతూ.. పైశాచిక ఆనందం పొందడం పవన్ కు సరికాదన్నారు. వారాహి యాత్రను ఒక పిచ్చి వాడి పర్యటనగా ప్రజలు భావిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ జనసేన అధినేత ఇస్తున్న హావభావాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. నాలుగు రోజులు పర్యటిస్తే రెండు రోజులు నిద్రపోయే పవన్ కళ్యాణ్ కి.. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు నిరంతరాయంగా కాలినడకన పర్యటించిన సీఎం జగన్ గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. అధికారం లేకపోయే సరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు నరకం కనబడుతోందని మల్లాది విష్ణు విమర్శించారు. ధైర్యముంటే తెలుగుదేశం హయాంలో DBT ద్వారా ఎంత మంది నిరుపేదలకు లబ్ధి చేకూర్చారో ప్రతిపక్ష నేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకానీ అబద్ధాలతో ముప్పేట దాడి చేయడం, అవాస్తవాలతో పోస్టర్లను అంటించినంత మాత్రాన ప్రజల హృదయాలలో ముద్ర వేసుకున్న సీఎం జగన్ పేరును చెరపలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు కుక్కల రమేష్, కొమ్ము చంటి, S.V.D.అశోక్, రాజశేఖర్ రెడ్డి, బెల్లపు సత్యనారాయణ, కంభంపాటి మోజస్, నాగభూషణం, చింతకాయల చిట్టిబాబు, క్రాంతి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *