విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం విజయవాడ, గుణదలలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హోటల్ రంగాన్ని గుర్తిస్తామని దానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని హోటల్ రంగంలో ఇబ్బందులను తన దృష్టికి కమిటీ తీసుకొచ్చిందని రాష్ట్రంలో హోటల్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చిన్న స్థాయి హోటల్స్ కూడా బాగుండాలన్నారు. హోటల్ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తామని హోటల్స్‌లో భోజనం నాణ్యత పాటించాలని నాణ్యత రుచి ఉంటే ప్రజలు అక్కడికే వస్తారు. ఏ రంగంలోనైనా ఫ్రెండ్లీ విధానం ఉండాలని సూచించారు. నైట్ ఫుడ్ కోర్టుల వల్ల హోటల్ వ్యాపారులు నష్టపోతారని చెప్పారు సమయాలు మార్చే విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు ఏ వర్గం కూడా ఇబ్బందిపడకుదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద హోటల్స్‌తో పాటు చిన్న, మధ్యస్థాయి హోటల్స్ వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అసోసియేషన్ ఏం కోరితే అది చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా వున్నారని చెప్పారు. ఎపి హోటల్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు ఆర్.వి.స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక, అతిధ్యరంగాలను బలోపేతం చేసేందుకు తమవంతు సహకారం అందిస్తోందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమకు చేతనైనంత మేరకు ప్రభుత్వంతో చేయిచేయి కలిపేందుకు సిద్దంగా వున్నామని తెలిపారు. నూతన గౌరవ కార్యదర్శిగా ఎం.నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.హనుమంతరావు, కోశాధికారిగా పి.వి.పూర్ణచంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్, రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి హోటల్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News