Breaking News

సీఐడీ చీఫ్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు స్వీకరించిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయలు

-కోలుకున్న తర్వాత తిరిగి సీఐడీ చీఫ్‌గా రానున్న సంజయ్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయలు సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌ఛార్జి హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ సీఐడీ చీఫ్‌గా పనిచేస్తున్న సంజయ్‌ హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్లు ఆయనికి సర్జరీచేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సంజయ్‌ కోలుకుంటున్నారని, తిరిగి రాగానే సీఐడీ చీఫ్‌గా యథాస్థానంలోకి వస్తారని సీడీఐ కార్యాలయం స్పష్టంచేసింది. అప్పటివరకూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయలు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *