Breaking News

“మాదకద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేధం 2015”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు మరియు పోలీసు శాఖ వారి సంయుక్త అధ్వర్యంలో “ర్యాగింగ్ నివారణ” మరియు నల్సా వారి “మాదకద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేధం 2015” పథకం పై దవళేశ్వరంలోని వివేకానంద ఐ.టి.ఐ కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ విద్యార్ధులు ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు దూరంగా ఉండాలన్నారు. తోటి విద్యార్ధులకు అవమానకరంగా, బాధించే విధంగా చేసే ఎలాంటి పనైనా ర్యాగింగ్ గా భావించ బడుతుందన్నారు. ర్యాగింగ్ నిషేధంలో కళాశాల యాజమాన్యాలు పాటించాల్సిన నియమాల గురించి ఆమె తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం, 1997 గురించి వివరించారు.

ఈ సదస్సులో “ఎన్.డి.పి.ఎస్. ఆక్ట్, 1985” గురించి ప్రత్యూష కుమారి అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల గురించి వివరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్నా చట్టపరంగా శిక్షార్హులు అవుతారని, తద్వారా భవిష్యత్తు దెబ్బ తింటుందన్నారు. వారి చుట్టు పక్కల అనుమానాస్పద చర్యలు జరిగితే వాటికి దూరంగా ఉండడం తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.

ఈ సదస్సులో ట్రైనీ న్యాయ మూర్తులు జి. హర్షవర్ధన్, కె. భాను, ఎం. జగదీశ్వరి, సాయి సుభాష్, శ్రీమతి. ఏ. హిమబిందు, వి. స్వర్ణలత, కుమారి వి. సాహితి,  జి. బుల్లెమ్మ, శ్రీమతి. పి. సాయి సుధ, రాజమహేంద్రవరం సౌత్ జోన్ డీ.ఎస్.పి. కె. శ్రీనివాసులు, ధవళేశ్వరం సీ.ఐ. కె. మంగా దేవి, కళాశాల ప్రిన్సిపల్ కె. సుబ్బ రాజు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *