విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ప్రతి పౌరుడు ఆత్మ విశ్వాసం, గౌరవంతో జీవించేలా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవిన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు.సెంట్రల్ నియోజక వర్గ పరిధిలో 64 వ డివిజన్ – పాలకేంద్రం, కుందా వారి కండ్రిక వద్ద రూ.3.40 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, 61 వ డివిజన్ – H బ్లాక్, వాంబేకాలనీ నందు రూ.69.90 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం, 60 వ డివిజన్ – మస్జిద్, డిస్నీ ల్యాండ్ రోడ్డు, B బ్లాక్, వాంబేకాలనీ నందు రూ.69.90 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమములకు రెవెన్యూ శాఖమాత్యులు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిధి గ హాజరయ్యారు. వాంబేకాలనీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మంత్రి మాట్లాడుతూ పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సచివాలయ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అన్ని అవసరాలు తిరుస్తున్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదన్నారు. ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమని అన్ని రాష్ట్రాల్లోనూ ధరలు ఒకే విధంగా ఉంటాయన్నారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల లబ్ది చేకూరుస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా లబ్ది చేకూర్చి జీవన ప్రమాణాలు పెంచామన్నారు. ప్రాధమిక స్థాయి నుండే ఇంగ్లీష్ లో విద్య భోదన, అమ్మఒడి, విద్యాదీవెన, తదితర పథకాలతో ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా పునాది వేస్తున్నామన్నారు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండి కుటుంబ గౌరవం కాపాడేది మహిళ అని గుర్తించి అన్ని పథకాల లబ్ధిని మహిళల ఖాతాలకే జమ చేస్తున్నామన్నారు. తద్వారా స్థితి గౌరవం పెంచామన్నారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూన్న స్థానిక శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ ను గుర్తించుకొని ఆదరించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.స్థానిక శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి తావు లేని పారదర్శక పాలనా ప్రజలకు అందిస్తున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి సచివాలయాలు వారధిగా పనిచేస్తూ అవసరాలు తిరుస్తున్నాయన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని ప్రగతో పథంలో నడిపిస్తున్నామన్నారు.కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి , మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్ , డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి , నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇంచార్జిలు, కోఆర్డినేటర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు – డైరెక్టర్లు – సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News