Breaking News

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బండ్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి అవసారర్డులకు అండగా నిలుస్తున్నామని ట్రస్ట్ ఛైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం 12వ డివిజన్ నందు వైస్సార్సీపీ నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు. అదేవిధంగా ఫారూఖ్ నగర్ రోడ్ కి చెందిన రెండు నిరుపేద కుటుంబాలు కసాని విజయలక్ష్మి, సలీమ్ బాషా లకు జీవనోపాధి నిమిత్తం దాదాపు రూ.40,000/- విలువ గల టిఫిన్ మరియు తోపుడు బండ్లను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ ఉచితంగా అందజేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్ళ కాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఈ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నివసించే సొంత డివిజన్ అయిన సరే గత ప్రభుత్వం లో ఈ డివిజన్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఒక ప్రక్క ప్రభుత్వం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మరోవైపు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్ వైసీపీ నాయకులు రీజ్వాన్,ఖలీమ్,కాళీ,ఎన్.వి రెడ్డి,పల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *