-జిల్లాలో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ద్వారా 4.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ..
-ఖరీఫ్ లో పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ..
-ప్రోక్యూర్ మెంట్ ప్రాసెస్ పై పిపిటి పై ప్రదర్శన
-అధికారులకు జేసీ దిశా నిర్థేశం..
-అవసరమైన గన్నీ బ్యాగ్స్ సిద్దం చేశాం..
-జేసీ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రస్తుత 2023-24 ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించి, పండిన మొత్తం ధాన్యం సేకరణే లక్ష్యంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.
బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో 2023-24 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ పై రెవెన్యూ, పౌర సరఫరాల, సహకార , తూనికలు కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్స్, కాస్టోడియన్ అధికారులతో నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు . తొలుత జ్యోతి ప్రజ్వలన తో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ధాన్యం సేకరణ అంశానికి సంబందించిన పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లాలో ఈ 2023-24 ఖరీఫ్ లో 73, 216 హెక్టార్లలో రైతులు వరి పంట సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేజయడం జరుగుతుందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల 40 వేలు మెట్రిక్ టన్నల వరకు ధాన్యాన్ని సేకరించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఆమేరకు స్థానిక అవసరాలకు 23,825 మెట్రిక్ టన్నుల వినియోగం అవుతుందని అన్నారు. నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసేవి 11982 మెట్రిక్ టన్నుల ఉంటుందని, మిగిలినది సి ఎమ్ ఆర్ కింద పౌరసరఫరాలు సంస్థ ద్వారా కొనుగోలు చేస్తామని జేసీ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే కోటి 11 లక్షల గన్నీ బ్యాగ్స్ సేకరించి ఆయా ఆర్బీకేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ముందస్తుగా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆమేరకు రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు తెలిపారు.
ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం కల్పించిన పూర్తి స్థాయిలో మద్దతు ధరను అందిస్తామన్నారు. కస్టమైజ్డ్ మిల్లర్లు సరఫరా చేసే గన్ని బ్యాగులకు అనుగుణంగా లక్ష్యాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ప్రధానంగా నాలుగైదు రకాలు ధాన్యం దిగుబడి వస్తుందని వాటిలో ఎంటియూ 1064 ఇంద్రా రకం 80,367 ఏమ్.టి., ఏం టి యూ 7029 (స్వర్ణ) రకం 1,73,061 ఎమ్.టి. , పి ఎల్ ఏ 1100 రకం 1,06,128 ఏం టి., సంపద స్వర్ణ 44,382 ఎమ్ టి., ఉన్నాయన్నారు.
గత మూడు ఖరీఫ్ లో దిగుబడి ఆధారంగా చేసుకుని ఈ సీజన్ లో అవసరమైన గన్ని బ్యాగులకు చెందిన ఇండెంట్ పౌర సరఫరాలు, డి ఎం పౌర సరఫరాలు, వ్యవసాయ అధికారులు బుధవారం సాయంత్రం కు అందచెయ్య లన్నారు. ఆ నివేదిక మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ లో 4,76,502 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాకు రావడం జరిగిందన్నారు. ఆమేరకు స్థానిక అవసరాలకు 23,825 మెట్రిక్ టన్నుల వినియోగం అవుతుందని అన్నారు. నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసేవి 11982 మెట్రిక్ టన్నుల ఉంటుందని, పౌర సరఫరాల సంస్థ ద్వారా 4,40,695 మెట్రిక్ టన్నుల కొనుగోలు కు అవకాశం ఉందన్నారు. గత మూడు సీజన్లలో గరిష్టంగా 2.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చెయ్యడం జరిగిందన్నారు.
ప్రోక్యూర్ మెంట్ ప్రాసెస్ పై పిపిటి ద్వారా అవగాహన కలుగ చేశారు. వి ఏ ఏ లాగిన్, షెడ్యూలింగ్, టి ఎ లాగిన్, ట్రక్ షీట్, తదితర అంశాలపై టెక్నికల్ శిక్షణ అందచేశారు. గ్రామ స్థాయి నుంచి ఆర్భికే వరకు, తదుపరి మిల్లింగ్ వెళ్ళే విధానం పై అవగాహన కలుగ చేశారు. గత సీజన్లో ఎదురుకొన్న అంశాల కు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో సాగు చేసే ధాన్యం రకాలు సి ఎం ఆర్ ద్వారా సేకరించవలసిన ధాన్యం , అవసరమైన గన్ని బ్యాగులు తదితర అంశాలపై మండలాలు వారిగా, అర్భికే ల వారీగా వివరాలుతెలియ చెయ్యడం జరిగింది.
రైతు పండించిన ధాన్యాన్ని మిల్లులు తీసుకొచ్చినప్పుడు తేమ శాతం 17 కంటే మించి ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. రైతునుంచి ధాన్యం కొనుగోలు విధానాన్ని ఆన్లైన్ ద్వారా లావాదేవీలను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తూ, వారి ధాన్యం సొమ్ము 21 రోజుల వ్యవధిలో వారి బ్యాంకు అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు. దళారీల ప్రమేయం లేకుండా రైతులకు లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు సరఫరా చేసే గోనెసంచులు ముందుగానే వారికి ఎన్ని అవసరమో అన్ని మాత్రమే ఆయా ఆర్బీకేలకు ఇవ్వాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను గన్ని బ్యాగ్స్ కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు అవసరం మని అందుకు తగ్గ విధంగా అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు. రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తరలించే క్రమంలో హమాలీ, రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఏడు గంటల లోపే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ మిల్లర్లకు తెలియజేశారు. రైతులు నుంచి ధాన్యం కొనుగోలులో అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో సమర్థవంతంగా రైతుకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలని జేసీ అధికారులకు సూచించారు. శిక్షణ అనంతరం ప్యాడీ పొక్యూర్ మెంట్ పై ఏమైన సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఏ. కుమార్, జిల్లా పౌర సరఫరాల అధి కారి బి. విజయ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, మార్కెటింగ్ అధికారి ఏం.సునీల్ వినయ్, జిల్లా సహకార అధికారి వై. ఉమామహేశ్వరరావు, సాఫ్ట్వేర్ డెవలపర్ సిహెచ్. అనిల్ కుమార్, జిల్లా డివిజన్, మండల స్థాయి అనుబంధ రెవెన్యూ, పౌర సరఫరాల, సహకార , తూనికలు కొలతలు, రవాణా శాఖల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్స్, కాస్టోడియన్ , అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News