Breaking News

గొలగాని చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా పఖ్వాడా పక్షోత్సవాలు సందర్భంగా చిట్టినగర్‌ విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపంలో గొలగాని రవికృష్ణ వారి గొలగాని చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బి.జె.పి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు చేయమని ఆదేశించిన నేపథ్యంలో నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని అక్టోబర్‌ రెండు గాంధీ జయంతి వరకు పలు సేవా కార్యక్రమాలు కార్యకర్తలు చేసుకుంటూ వచ్చారని అందులో భాగంగా ఈరోజు బడుగు బలహీనర్గాల పేద మహిళలకు జీవన భృతి కోసం గొలగాని రవి కృష్ణ, గొలగాని చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తనని భాగస్వామిగా చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. రవి కృష్ణ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ రవికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. గొలగాని రవికృష్ణవారి గొలగాని చారిటబుల్‌ ట్రస్ట్‌ వారి సేవా కార్యక్రమాలలో భాగంగా బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీ Ê ఈబిసి మహిళలకు (లైన్స్‌క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ స్మైల్స్‌ వారి ద్వారా శిక్షణ పొందిన వారికి) కుట్టు మిషన్లు పంపిణీ, పేద మహిళలకు చీరల పంపిణీ, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అన్నదాన వారధి ద్వారా అన్నదానం కార్యక్రమాలు పురంధరేశ్వరి చేతుల మీద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్‌, మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ బాజీ, రాష్ట్ర మీడియా ఇంచార్జ్‌ నాగభూషణం, రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు మిట్ట వంశి, జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్‌, బిజెపి నాయకులు శివకుమార్‌ పట్నాయక్‌, పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్‌ పొట్టి వెంకట శ్రీహరి, ఓబీసీ మోర్చా నాయకులు అవార్‌ బుల్లబ్బాయి, లైన్స్‌క్లబ్‌ అధ్యక్షులు రాజగిరి సోమేశ్వరావు, జోన్‌ చైర్‌పర్సన్‌ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *