Breaking News

ప్రజల సమస్యలకు.. సత్వర పరిష్కారం కోసమే జెకేసీ

-దేవరపల్లి మండలం జేకేసి లో 96 ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ
-వారం రోజుల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్క అర్జికి పరిష్కారంకు చర్యలు.
-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత
-ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయి జేకేసి
-జవాబు దారి తనంతో కూడిన పౌరు సేవలు అందిస్తున్నాం.
-శాసనసభ్యులు తలారి వెంకట్రావు
-దేవరపల్లి ఎంపిడివో కార్యాలయంలో “జగనన్నకు చెబుదాం” మండల స్థాయి కార్యక్రమం
-హాజరైన జేసీ ఎన్. తేజ్ భరత్ అసిస్టెంట్ కలెక్టర్ సి .యశ్వంత్ కుమార్, డిఆర్వో జి.  నరసింహులు, జిల్లా అధికారులు

దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం అందించేలా.. “మండల స్థాయి జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు లు పేర్కొన్నారు.

శుక్రవారం దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో దేవరపల్లి మండల స్థాయి “జగనన్నకు చెబుదాం” స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే, జేసీ సహాయ కలెక్టర్, డిఆర్వో లు హాజరై ప్రజల నుంచి పరిష్కారం కోసం వచ్చిన 96 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా.. మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కో మండలంలో.. “జగనన్నకు చెబుదాం” స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ స్థాయి సమస్యలు క్షేత్ర స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యలకు నాణ్యతతో కూడిన విధంగా వేగవంతంగా పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగు తోందన్నారు. “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ స్పందన కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలు, ఇంటి పట్టా సమస్యలు, కరెంటు మీటర్ల సమస్యలు, శానిటేషన్ పై ఎక్కువగా అర్జీలు ఉన్నాయన్నారు . ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు అధికారులు అందించే పరిష్కార నివేదికలు, స్పష్టంగా ఉండాలని, ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ది తో పనిచేయాలనే లక్ష్యం దిశగా జగనన్న కు చెబుదాం 1902 ప్రవేశ పట్టడం జరిగిందన్నారు. అదే విధంగా గడప గడపకు మన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చెయ్యడం జరిగిందన్నారు. మరింతగా ప్రజా సమస్య పరిష్కారం కోసం నేడు మండల స్థాయి లో జేకేసి ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర జిల్లా అధికారులు హాజరవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి వేదికల మీద రెవెన్యూ, భూ సంబంధ సమస్యలకు తక్షణ పరిష్కారం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆమేరకు ఉన్నతాధికారులు సమక్షం లో జరిగిన మండల స్థాయి కార్యక్రమం పూర్తి స్థాయి లో విజయవంతం అవడం జరిగిందని తెలిపారు.

దేవరపల్లి మండలం లో జేకేసి లో వచ్చిన అర్జీలను రానున్న ఏడు రోజుల్లో పరిష్కారం చెయ్యడానికి కార్యాచరణ అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ, హౌసింగ్ రహదారులు, విద్యుత్  సంబంధ మైనవి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్డీవో, తహశీల్దార్, గ్రామ స్థాయిలో విఆర్ఏ లు ఆయా అర్జీల పరిష్కారం కోసం మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్థిక పరమైన అంశాలతో కూడిన అర్జీలను జిల్లా, డివిజన్ స్థాయి లో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి  నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరిం చేందుకు తగు చర్యలు చేపట్టాలని  జేసీ తేజ్ భరత్  అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్వో  జి నరశింహులు, డియంహెచ్ఓ డా. కె.వేంకటేశ్వరరావు,  సీపీఓ  ఎ. ముఖలింగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డీటీవో ఎన్. సత్యనారాయణ, డీఈఓ  ఎస్ అబ్రహం, ఆర్టీవో కె.వి. కృష్ణారావు,  ఎల్డీయం డీబీ ప్రసాద్, డ్వామా పి.డి..పి జగదాంబ, హౌసింగ్ పిడి.. పరశురామ్, డిఓహెచ్ఓ ఎస్టీజీ సత్యగోవిందం, డీసీహెచ్ ఓ డా. ఎన్. సనత్ కుమారి, డిఎంహెచ్ఓ డా. కె.వెంకటేశ్వరరావు, డిపిఓ సత్యనారాయణ  డిఎల్డిఓ , డిఆర్డిఏ పి.డి సుభాషిణి, డిటి డబ్ల్యూఓ జ్యోతి, డిఎస్ఓ పి. విజయ భాస్కర్, డిటిఓ సత్యనారాయణ, ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ బాలశంకర్, డిఈఓ ఎస్ అబ్రహం, డి ఐ పిఆర్వో సిహెచ్. శ్రీనివాస్, దేవరపల్లి సర్పంచ్ కడిమి వీరకుమారి, జడ్పీటీసీ పొట్టి స్వర్ణ లత, ఎ. ఎమ్. సి ఛైర్ మెన్, జి. జనార్ధన్
స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు జిల్లా  స్థాయి అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *